నితిన్ ప్లేస్ లో ఎవరు.. స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఏంటి..?
నితిన్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో అంటే కచ్చితంగా ఒక మంచి ఎంటర్టైనర్ సినిమా ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేశారు. ఐతే ఏమైందో ఏమో కానీ ఆ సినిమా నుంచి నితిన్ బయటకు వచ్చాడు.;
తమ్ముడు తర్వాత నితిన్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వేరే వాళ్లకి వెళ్తున్నాయి. ఆల్రెడీ వేణుతో చేయాల్సిన ఎల్లమ్మ నుంచి నితిన్ తప్పుకున్నట్టే. ఐతే మేకర్స్ మాత్రం ఆ విషయాన్ని అఫీషియల్ గా చెప్పలేదు. ఈ గ్యాప్ లో నితిన్ వేరే కాంబినేషన్ సినిమా సెట్ చేసుకోవడం ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా ఎగ్జిట్ అవ్వడం జరిగింది. నితిన్ తో శ్రీను వైట్ల ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించేలా ప్లాన్ చేశారు.
ఒక యంగ్ హీరోతో శ్రీను వైట్ల..
నితిన్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో అంటే కచ్చితంగా ఒక మంచి ఎంటర్టైనర్ సినిమా ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేశారు. ఐతే ఏమైందో ఏమో కానీ ఆ సినిమా నుంచి నితిన్ బయటకు వచ్చాడు. నితిన్ ఎగ్జిట్ కి రీజన్స్ ఏంటన్నది కూడా తెలియలేదు. ఐతే ఇప్పుడు అదే కథను శ్రీను వైట్ల ఒక యంగ్ హీరోకి చెబితే అతను ఓకే చేశాడట. అంతేకాదు ఆ హీరోకి కథ బాగా నచ్చేసిందట.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే ఆ సినిమా అనౌన్స్ మెంట్ త్వరలో రాబోతుందని తెలుస్తుంది. ఎల్లమ్మ చేజారింది సరే నితిన్ శ్రీను వైట్ల కాంబినేషన్ ఎందుకు బ్రేక్ అయ్యింది అన్నది అందరి డౌట్. నితిన్ ఈమధ్య విక్రం కుమార్ తో సినిమా చేస్తాడన్న టాక్ వచ్చింది. సో అతని సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో శ్రీను వైట్ల సినిమా కాదన్నాడా అన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి.
కెరీర్ లో కొత్త టర్న్..
ఐతే ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఒకరు కాదన్న సినిమాలు నితిన్ చేస్తే రిజల్ట్ తేడా కొట్టాయి కానీ నితిన్ కాదన్న సినిమా.. లేదా కొన్ని కారణాల వల్ల కుదరని సినిమాలు మాత్రం బాగానే వర్క్ అవుట్ అయ్యాయి. నితిన్ కెరీర్ లో కొత్త టర్న్ తీసుకుంటే తప్ప ఇక మీదట స్ట్రాంగ్ గా నిలబడే పరిస్థితి కనిపించట్లేదు. మరి నితిన్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి. శ్రీను వైట్ల కూడా ఈమధ్య అసలేమాత్రం ఫాం లో లేడు. సో ఆయన కూడా రాబోతున్న సినిమాతో సూపర్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.
యువ దర్శకులు, యువ హీరోలు డిఫరెంట్ సినిమాలతో అదరగొట్టేస్తున్న ఈ టైం లో స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల, రెండు దశాబ్దాలుగా హీరోగా చేస్తున్న నితిన్ ఇప్పటికీ కెరీర్ స్ట్రగుల్ అవ్వడం ఆశ్చర్యకరంగా ఉంది. ఐతే శ్రీను వైట్ల ఈ సినిమాతో కచ్చితంగా హిట్ టార్గెట్ పెట్టుకున్నారు. నితిన్ కూడా తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడని తెలుస్తుంది.