నితిన్ ఆ క్రేజీ డైరెక్టర్‌ని అయినా ఫైనల్ చేసుకుంటాడా?
ఇదిలా ఉంటే గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నితిన్ రాబిన్ హుడ్, తమ్ముడుతో వరుస ఫ్లాపుల్ని సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచాడు.;
చాలా మంది టాలీవుడ్ హీరోల్లో క్లారిటీ అనేది ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. కొంత మంది తమకు ఏది కావాలో.. ఏ కథ అయితే తమని పూర్తిగా ఎలివేట్ చేసి సూపర్ హిట్ ఇస్తుందో ఇట్టే పట్టేస్తున్నారు.. పర్‌ఫెక్ట్‌గా చెప్పేసి దానికే లాక్ వేసేస్తున్నారు. కానీ కొంత మంది మాత్రం లాక్ ఆఫ్ క్లారిటీ లేకపోవడంతో ఏదీ తేల్చుకోలేక, డైరెక్టర్ల టైమ్ కిల్ చేస్తూ వారి కెరీర్‌ని కిల్ చేసుకుంటున్నారు. ఈ జాబితాలో ముందు వరుసలో నిలుస్తున్నాడు హీరో నితిన్. గతంలో ఓ యంగ్ డైరెక్టర్ వాస్తవ సంఘటనల ఆధారంగా కొల్లేరు సరస్సు నేపథ్యంలో పక్కా పొలిటికల్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
కానీ దాన్ని తెరపైకి తీసుకురావడానికి ఏళ్ల తరబడి వెయిట్ చేయించి ఫైనల్‌గా ఆ స్టోరీనే తెరపైకి రాలేని పరిస్థితుల్లోకి తీసుకెళ్లడంతో అది ఇప్పటికీ తెరపైకి రావడానికి నోచుకోలేదు. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నితిన్ రాబిన్ హుడ్, తమ్ముడుతో వరుస ఫ్లాపుల్ని సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచాడు. వరుస ఫ్లాపుల తరువాత నతకు `ఇష్క్`తో హిట్టిచ్చిన విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది.
కానీ అది కార్యరూపం దాల్చలేదు. యువీ క్రియేషన్స్, విక్రమ్ కుమార్ సైలెంట్ అయిపోయారు. ఇక `90`స్ సక్సెస్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఆదిత్య హాసన్‌ని రంగంలోకి దించి తనతో సినిమాకు రెడీ అయ్యాడు నితిన్.. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అది కాస్తా ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసరికి చేతుల మారిపోయింది. ఆనంద్ దేవరకొండ చేతిలోకి వెళ్లింది.. అదే `కల్ట్`. ఇక `బలగం` వేణు డైరెక్షన్‌లో `ఎల్లమ్మ` నుంచి నాని తప్పుకోవడంతో ప్రధానంగా నితిన్ పేరు వినిపించింది.
దిల్‌రాజు కూడా నితిన్‌తోనే చేయాలని ఫిక్సయ్యాడు కూడా.. కట్ చేస్తే ఈ ప్రాజెక్ట్‌లోకి ఊహించని విధంగా దేవిశ్రీప్రసాద్ వచ్చి చేరాడు. ఇది కూడా నితిన్ చేజారి పోయింది. కారణం నితిన్‌లోని లాక్ ఆఫ్ కన్ఫ్యూజన్. దాని వల్లే క్రేజీ ప్రాజెక్ట్‌లు గత కొంత కాలంగా చేతుల మారుతూ వస్తున్నాయి. ఇవి నితిన్ చేస్తే ప్రస్తుతం స్లంప్‌లో ఉన్న తన కెరీర్‌కు ప్లస్ అయ్యేది. కానీ వాటిని నితిన్ చేజేతులా వదులకున్నాడనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఈ నేఫథ్యంలో మరో డైరెక్టర్ పేరు తెరపైకొచ్చింది.
తనే `ఆయ్` ఫేమ్ అంజి కె.మణిపుత్ర. తొలి సినిమాతో మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న అంజి కె. మణిపుత్రతో సినిమా చేయడానికి నితిన్ రీసెంట్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ని స్వయంగా నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్‌లో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడట. అంతా ఓకే కానీ ఎల్లమ్మ, ఆదిత్య హాసన్‌ల ప్రాజెక్ట్‌లని మార్చేసినట్టుగా `ఆయ్` డైరెక్టర్‌ని పక్కన పెట్టేయడుగా? అని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి నితిన్ ఈ డైరెక్టర్‌తో ముందుకెళతాడా?.. లేక మరో క్రేజీ డైరెక్టర్ దొరగ్గానే తనని వదిలేస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.