నితిన్ కూడా అలానే వెళితే..
నితిన్ నెక్స్ట్ ‘అలియాస్ రుక్మిణి’అనే కొత్త సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. నాని సమర్పణలో, దీప్తి గంట నిర్మిస్తున్న ఈ సినిమాకు మురళీకాంత్ దేవసోత్ దర్శకుడు.
నితిన్ నెక్స్ట్ ‘అలియాస్ రుక్మిణి’అనే కొత్త సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. నాని సమర్పణలో, దీప్తి గంట నిర్మిస్తున్న ఈ సినిమాకు మురళీకాంత్ దేవసోత్ దర్శకుడు. రాబిన్ హుడ్, తమ్ముడు రెండూ ఆశించిన రిజల్ట్ ఇవ్వకపోవడంతో నితిన్‌కు ఇప్పుడు ముందుగా ఒక క్లీన్ కమర్షియల్ హిట్ అవసరం. అలాంటి టైమ్‌లో సినిమాను ఎంతకు అమ్మారు అన్న లెక్క కూడా రిజల్ట్‌లో చాలా తేడా తీసుకొస్తుంది.
ఈమధ్య వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దగ్గర అదే జరిగింది. వరుసగా సినిమాలు దెబ్బ తిన్న తర్వాత ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్‌ను భారీగా పెంచకుండా తక్కువ రేంజ్‌లోనే ముగించినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ వచ్చాయి. నాన్ థియేట్రికల్ హక్కుల నుంచే మంచి నెంబర్స్ వచ్చాయి. సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కు చేరింది. అంటే భారీ నంబర్ల కోసం ఎదురు చూడకుండానే బయ్యర్లు ముందే సేఫ్ అయ్యారు.
అఖిల్ ‘లెనిన్’ దగ్గర నిర్మాత నాగవంశీ ఇదే లెక్కను ఓపెన్‌గా చెప్పాడు. నాగార్జునతో కలిసి ప్రతి ఏరియాలో రేట్లు బాధ్యతగా ఫిక్స్ చేశామని, మొదటి వీకెండ్‌కే డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడి వెనక్కి తెచ్చుకోవాలని ముందే నిర్ణయించుకున్నామని ఆయన వెల్లడించాడు. సినిమా ఓపెనింగ్స్ కలిసి రావడంతో మొదటి వీకెండ్‌లోనే బయ్యర్లు రికవర్ అయ్యారు.
ఇప్పుడు నితిన్‌కు కూడా ఇలాంటి లెక్కే బాగా ఉపయోగపడొచ్చు. ‘అలియాస్ రుక్మిణి’ని నాని సమర్పిస్తుండటం, ‘కోర్ట్’ తర్వాత నుంచి వస్తున్న మరో నిర్మాణ ప్రయత్నం కావడంతో బిజినెస్ దగ్గర మంచి డిమాండ్ రావచ్చు. కానీ ఆ పేరును చూసుకుని రేట్లు ఎక్కువగా పెంచితే మొదటి రోజు నుంచే టార్గెట్ కూడా పెరిగిపోతుంది. టాక్ బాగుంటే సమస్య లేదు. కొంచెం అటు ఇటుగా ఉన్నా మాత్రం హిట్ కావాల్సిన సినిమా మళ్లీ రికవరీ లెక్కల్లో చిక్కుకుంటుంది.
నితిన్‌కు గత కొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు.. వరుసగా సినిమాలు వచ్చినా బాక్సాఫీస్ దగ్గర కావాల్సిన హిట్ పడలేదు. నితిన్ మార్కెట్ పూర్తిగా పోయిందని చెప్పలేం. మంచి సినిమా పడితే ఓపెనింగ్స్ తెచ్చే గుర్తింపు ఇంకా ఉంది. అందుకే ఇప్పుడు మరోసారి స్కేల్ చూపించడంకంటే ముందుగా మార్కెట్‌ను తిరిగి సెట్ చేసుకోవడం ముఖ్యం.
మేకింగ్ కాస్ట్‌ను అదుపులో ఉంచి, థియేట్రికల్ హక్కులను రీజనబుల్ రేట్లకు ఇస్తే సినిమా మీద అనవసరమైన టార్గెట్ పడదు. అయితే బిజినెస్ ఇంకా ఏ రేంజ్‌లో జరుగుతుందో బయటకు రాలేదు. కానీ కొరియన్ కనకరాజు, లెనిన్ చూపించిన లెక్క మాత్రం నితిన్‌కు సరిపోతుంది. ముందు బయ్యర్ సేఫ్ అయ్యే రేటు పెట్టి ఒక హిట్ కొడితే, తర్వాతి సినిమాకు మార్కెట్ పెంచుకోవచ్చు.