మళ్ళీ 12 ఏళ్ళ తరువాత ఆ డైరెక్టర్ తో నితిన్

అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు చిత్రం కూడా సెట్స్ పైన ఉంది.

Update: 2024-05-23 14:30 GMT

యంగ్ హీరో నితిన్ కెరియర్ లో హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని నితిన్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో టైర్ 2 హీరోలలో ఒకడిగా నితిన్ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం నితిన్ వెంకి కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ మూవీ చేస్తున్నాడు. అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు చిత్రం కూడా సెట్స్ పైన ఉంది.


ఈ రెండు సినిమాలపైన పాజిటివ్ బజ్ ఉంది. నితిన్ సినిమాల నుంచి ఆడియన్స్ ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఆశిస్తారు. అతను కూడా కచ్చితంగా తన సినిమాలలో కామెడీకి ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటాడు. భీష్మ తర్వాత వెంకి కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ మూవీ చేస్తూ ఉండటంతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. మరో వైపు తమ్ముడు సినిమాని దిల్ రాజు బ్యానర్ లో చేస్తున్నారు.

ఈ రెండు లైన్ లో ఉండగానే 90s వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు నితిన్ జాబితాలోకి మరో ఇంటరెస్టింగ్ డైరెక్టర్ వచ్చినట్లు తెలుస్తోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మూవీకి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. నితిన్, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ ఇష్క్ మూవీ 2012లో వచ్చింది. వరుస డిజాస్టర్స్ తో ఉన్న సమయంలో నితిన్ కి ఇష్క్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి తిరిగి ఫామ్ లోకి వచ్చేలా విక్రమ్ కె కుమార్ చేశారు.

Read more!

ఇష్క్ తర్వాత నితిన్ కెరియర్ కూడా పుంజుకుంది. మరల 12 ఏళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ రాబోతోందని టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఉంటుందంట. విక్రమ్ కె కుమార్ చివరిగా నాగ చైతన్యతో థాంక్యూ మూవీ చేసి డిజాస్టర్ అందుకున్నారు. అయితే దూత వెబ్ సిరీస్ అతనికి సక్సెస్ ఇచ్చింది.

నితిన్ కి కూడా చాలా కాలంగా కమర్షియల్ హిట్ పడలేదు. ఇష్క్ లాంటి సూపర్ హిట్ తర్వాత మరల వీరిద్దరూ కలిసి వర్క్ చేయబోతున్న నేపథ్యంలో కచ్చితంగా ఈ కాంబినేషన్ కి హైప్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదిత్య హాసన్ తో చేయబోయే మూవీ తర్వాత నితిన్ విక్రమ్ కె కుమార్ సినిమాని స్టార్ట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News