దిల్ రాజు 'తమ్ముడు' ఎంత పోగొట్టాడు?

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా యువ హీరో నితిన్‌కు సరైన హిట్ లేదు. ఇక లేటెస్ట్ మూవీ తమ్ముడుపైనా అతను చాలా ఆశలు పెట్టుకున్నారు.;

Update: 2025-07-09 06:22 GMT

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా యువ హీరో నితిన్‌కు సరైన హిట్ లేదు. ఇక లేటెస్ట్ మూవీ తమ్ముడుపైనా అతను చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు ఊహించనంత నిరాశనే మిగిలింది. మిక్స్డ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా వర్కింగ్ డేస్‌లో మరింత డీగ్రేడ్ అవుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగిపోతున్నట్లే కనిపిస్తోంది.

మొదటి రోజు నుంచే ఓవరాల్‌గా వసూళ్లు తక్కువగానే ఉండగా, రివ్యూస్‌ కూడా పెద్దగా పాజిటివ్‌గా లేకపోవడం తీవ్రంగా ప్రభావం చూపింది. వీకెండ్ ముగిసే సరికి మెజారిటీ థియేటర్లలో వసూళ్లు పడిపోయాయి. ఓవర్సీస్‌లో హోల్డ్ ఏ మాత్రం లేకపోవడం, దేశంలో ముఖ్యమైన ఏరియాల్లో నెగటివ్ షేర్స్ రావడం సాదారణ విషయాలు కాదు.

ఇప్పటికే థియేట్రికల్ షేర్స్ 4 కోట్లు కూడా దాటడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు. సినిమా కోసం ఎప్పుడు లేనంత రిస్క్ తీసుకున్నారు బడ్జెట్ దాదాపు ₹70 కోట్లు దాటిందట. ఇక నాన్ థియేట్రికల్ గా కూడా అంతగా కలిసి రాలేదు. ఈ లెక్కన చూస్తే నిర్మాత దిల్ రాజుకు కనీసం 35 కోట్లకు పైగా నష్టం తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే నితిన్ కెరీర్‌లోనే అత్యంత భారీ డిజాస్టర్ అని ట్రేడ్ లో చెబుతున్నారు.

దిల్ రాజు గతంలో గేమ్ చేంజర్ విషయంలోనూ భారీ లాస్ ఎదుర్కొన్నారు. సినిమా డిలే అవుతూ, ప్రాజెక్ట్ బడ్జెట్ భారీగా పెరగడం వల్ల దాదాపు 100 కోట్లు నష్టపోయారని అర్థమవుతోంది. ఈ నష్టాలను కొంతవరకూ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రికవరీ చేసినా, తాజాగా తమ్ముడు ఫెయిల్యూర్ వల్ల మళ్లీ షాక్ తగిలినట్టయింది. ఒకప్పుడు కంటెంట్‌తో విజయాలు అందించిన దిల్ రాజు.. ఇప్పుడు ప్లానింగ్‌ పరంగా కూడా తడబడుతున్నారని కొందరు విశ్లేషకులు అంటున్నారు.

ఇక నితిన్ కెరీర్ పరంగా చూస్తే.. వరుసగా మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మాన్, రాబిన్ హుడ్లతో పాటు ఇప్పుడు తమ్ముడు కూడా ఫెయిలవ్వడంతో ఆయన కెరీర్ తిరిగి ట్రాక్‌లోకి రావాలంటే కాస్త టైమ్ పట్టేలా ఉంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మళ్లీ నితిన్ సినిమాలపై రిస్క్ తీసుకోవాలంటే బలమైన కంటెంట్ అవసరం. అయితే నెక్స్ట్ అతను దిల్ రాజు ప్రొడక్షన్ లోనే బలగం దర్శకుడు వేణుతో ఎల్లమ్మ సినిమా చేస్తున్నాడు. మరి ఆ సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News