'తమ్ముడు' సెన్సార్.. A ట్విస్ట్!
తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ ను కంప్లీట్ చేసుకున్నారు. సెన్సార్ బోర్డు అధికారుల నుంచి A సర్టిఫికెట్ అందుకున్నారు.;
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇప్పుడు తమ్ముడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ టైటిల్ తో కొన్నేళ్ల క్రితం వచ్చి ఐకానికి హిట్ అందుకున్నారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్ అయిన నితిన్.. తమ్ముడు టైటిల్ తో థియేటర్లలో జులై 4వ తేదీ నుంచి సందడి చేయనున్నారు.
వకీల్ సాబ్, MCA ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన తమ్ముడు మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. యంగ్ బ్యూటీ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ ఫిమేల్ లీడ్స్ లో నటిస్తున్నారు. సీనియర్ నటి లయ కీలక పాత్ర పోషిస్తున్నారు. నితిన్ అక్కగా కనిపించనున్నారు. స్ట్రాంగ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు.
అయితే సినిమా విడుదలకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ ను కంప్లీట్ చేసుకున్నారు. సెన్సార్ బోర్డు అధికారుల నుంచి A సర్టిఫికెట్ అందుకున్నారు. దీంతో రిలీజ్ కు ముందు జరగాల్సిన అన్ని పనులను మేకర్స్ పూర్తి చేసుకున్నట్లు అయింది. థియేటర్స్ లోకి వచ్చి ఆడియన్స్ ను ఆకట్టుకోవడమే మిగిలి ఉంది.
అదే సమయంలో తమ్ముడు మూవీకి సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. అక్క కోసం ఏదైనా చేసే తమ్ముడి స్టోరీతో తెరకెక్కుతోంది. కాబట్టి తమ్ముడు చిత్రానికి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ ఇవ్వడం స్పెషలే. సినిమాలో విలేజ్ వైల్డ్ బ్యాక్ డ్రాప్ కారణంగా సెన్సార్ ఈ విధంగా జరిగినట్లు తెలుస్తోంది.
ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. దీంతో సినిమా కోసం వెయిట్ చేస్తున్నామని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసిన మేకర్స్.. రీసెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొత్తం కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు. వరుస అప్డేట్స్ తో మేకర్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.
మ్యూజికల్ అప్డేట్స్ తో ఆకట్టుకుంటున్నారు. పోస్టర్స్, గ్లింప్సెస్ తో ఇప్పటికే ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేశారు. సినిమాపై అంచనాలు పెంచారు. అదే సమయంలో కథ గురించి ఫుల్ గా రివీల్ చేయకుండా ఇంట్రెస్ట్ నెలకొల్పుతున్నారు. దీంతో తమ్ముడు మూవీ హిట్ అవుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నితిన్ కు సరైన హిట్ దక్కనుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.