వీడియో: జూనియ‌ర్ నితిన్ చికిరి చికిరి

ఇప్పుడు టాలీవుడ్ నటుడు నితిన్ కుమారుడు ఏడాది వ‌య‌సున్న అవ్యుత్ కూడా చికిరి పాట‌కు స్టెప్పు క‌లిపాడు.;

Update: 2025-11-24 08:25 GMT

చికిరి చికిరి.. కొద్ది రోజులుగా ఇంట‌ర్నెట్‌ని ఊపేస్తున్న లేటెస్ట్ సాంగ్ ఇది. `చికిరి..` పాట‌కు రామ్ చ‌రణ్ మ్యాజిక‌ల్ హుక్ స్టెప్, చీర‌లో జాన్వీ హొయ‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మార‌గా, స్వ‌ర‌మాంత్రికుడు, ఆస్కార్ గ్ర‌హీత ఏ.ఆర్ రెహ‌మాన్ మాస్ బీట్ గుండెల్లో ల‌య‌ను పెంచుతోంది. చికిరి పాట‌కు యూత్ వెర్రిగా డ్యాన్సులు చేస్తున్న వీడియోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇది ఒక వెర్రి వ్యామోహంగా మారింది.

ఇప్పుడు టాలీవుడ్ నటుడు నితిన్ కుమారుడు ఏడాది వ‌య‌సున్న అవ్యుత్ కూడా చికిరి పాట‌కు స్టెప్పు క‌లిపాడు. చిన్నారి అవ్యుత్ డాడీ నితిన్ తో క‌లిసి కార్ లో వెళుతున్నాడు. డెక్‌ లో చికిరీ పాట వినిపిస్తోంది. అద్భుత‌మైన బీట్ కి త‌గ్గ‌ట్టే, డాడీతో పాటు చేతిని తిప్పుతూ అవ్యుత్ ఈ పాట‌ను ఆస్వాధిస్తున్నాడు. నితిన్ ఒడిలో కూచుని అత‌డు ఎంతో క్యూట్ గా క‌నిపిస్తున్నాడు.

2020 లో నితిన్- షాలిని జంట వివాహ‌మైంది. 2024లో వీరికి అవ్యుత్ జ‌న్మించాడు. ఈ జంట గత సంవత్సరం సెప్టెంబర్‌లో తమ మొదటి బిడ్డ పుట్టాడని ప్రకటించి అభిమానులను ఆనందపరిచారు. సోషల్ మీడియా లో నితిన్ ఆ బిడ్డ పేరు `అవ్యుత్` అని ప్ర‌క‌టిస్తూ... మా కుటుంబంలో ``కొత్త స్టార్`` అని ఆనందం వ్య‌క్తం చేసాడు. చిన్నారి అవ్యుత్ రాక నితిన్- షాలిని కుటుంబాల‌కు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ జంట తమ‌ వ్యక్తిగత జీవితాన్ని సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేసిన ప్రతిసారీ అభిమానులు ప్రేమను ప్రదర్శిస్తూనే ఉన్నారు. అవ్యుత్ కు ఒక సంవత్సరం నిండిన క్ర‌మంలో వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. మ‌ళ్లీ ఇప్పుడు అవ్యుత్ కార్ లో త‌న తండ్రితో వెళుతూ చికిరీ పాట‌ను ఆస్వాధిస్తున్న వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.

నితిన్ న‌టించిన చివ‌రి సినిమాలు ఆశించిన విజ‌యాలు సాధించ‌లేదు. అత‌డు న‌టించిన `త‌మ్ముడు` ఇటీవ‌ల‌ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. త‌దుప‌రి నితిన్ ఒక స్పోర్ట్స్ డ్రామాలో కనిపించనున్నారు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. `ఇష్క్` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ కోసం విక్ర‌మ్ కే- నితిన్ క‌లిసి ప‌ని చేసారు. అందుకే త‌దుప‌రి సినిమా పెద్ద హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.



Tags:    

Similar News