చైతూ.. విశ్వక్.. ఇప్పుడు నితిన్

బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు ఏ సినిమాకు ఎలాంటి పోటీ ఎదురవుతుందో చెప్పడం కష్టం.

Update: 2026-10-09 05:56 GMT

బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు ఏ సినిమాకు ఎలాంటి పోటీ ఎదురవుతుందో చెప్పడం కష్టం. లేటెస్ట్ గా డిసెంబర్ మొదటి వారం టాలీవుడ్ కు ఒక మినీ పండగ సీజన్ లా మారిపోయింది. ఇప్పటికే ఇద్దరు యువ హీరోలు తమ సినిమాలతో డిసెంబర్ 4వ తేదీని లాక్ చేసుకోగా, ఇప్పుడు అదే రేసులోకి నితిన్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. నటిస్తున్న 'అలియాస్ రుక్మిణి' సినిమాను డిసెంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.




 


ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో ఈ బాక్సాఫీస్ క్లాష్ గురించే ఆసక్తికరమైన టాక్ నడుస్తోంది. ఎందుకంటే అదే డిసెంబర్ 4న నాగచైతన్య నటిస్తున్న మైథికల్ థ్రిల్లర్ 'వృషకర్మ' భారీ అంచనాలతో బరిలో దిగుతోంది. అటు విశ్వక్ సేన్ సైతం తన పొలిటికల్ యాక్షన్ డ్రామా 'లెగసీ' కోసం అదే డేట్ ను ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నాడు. వీటికి తోడు దుల్కర్ సల్మాన్ 'శ్రీ శ్రీ' కూడా అదే వీకెండ్ ను టార్గెట్ చేస్తుందనే టాక్ ఉంది.

దీంతో మూడు వేర్వేరు జానర్ల సినిమాలు ఒకేసారి ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. వరుస పరాజయాలతో ఉన్న నితిన్ కు ఈ సినిమా రిజల్ట్ చాలా కీలకం. భారీ ఆశలు పెట్టుకున్న రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఈసారి రొటీన్ ఫార్ములాను పక్కనపెట్టి, ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి ప్రేమకథకు సస్పెన్స్ ఎలిమెంట్ జోడించి అలియాస్ రుక్మిణిగా వస్తున్నాడు.

పైగా ఈ ప్రాజెక్ట్ ను నేచురల్ స్టార్ నాని తన యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సమర్పిస్తుండటం సినిమాపై అంచనాలను అమాంతం పెంచుతోంది. లేటెస్ట్ గా వదిలిన రిలీజ్ డేట్ పోస్టర్ కూడా సినిమాపై క్యూరియాసిటీని పెంచేలా ఉంది. కోర్టు ఆవరణలో సింపుల్ డ్రెస్, భుజానికి బ్యాగ్ వేసుకుని కృష్ణ అనే రిలేటబుల్ పాత్రలో నితిన్ లుక్ ఆకట్టుకుంటోంది. వెనక ఒక మహిళ షాడో కనిపించడం కథలోని సీక్రెట్ ఎలిమెంట్ కు హింట్ ఇస్తోంది. ధండోరా ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దీప్తి గంటా నిర్మిస్తున్నారు.

అయితే రిలీజ్ డేట్ ఇచ్చేశారు కానీ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. చివరి షెడ్యూల్ చిత్రీకరణతో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మేకర్స్ పరుగులు పెట్టిస్తున్నారు. డిసెంబర్ 4 నాటికి సినిమాను రెడీ చేయడంతో పాటు, ఆ రోజు ఉన్న భారీ పోటీ మధ్య థియేటర్ల పంపకాలు చూసుకోవడం నిర్మాతలకు పెద్ద టాస్క్. సరైన ప్లానింగ్ లేకపోతే స్క్రీన్ల కౌంట్ లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక ప్రమోషన్స్ స్పీడ్ పెంచేందుకు త్వరలోనే ఫస్ట్ సింగిల్ ను లాంచ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించనున్నారు. ఒక పక్క మైథాలజీ, మరో పక్క పొలిటికల్ యాక్షన్.. ఈ రెండు జానర్ల మధ్య నితిన్ తన సస్పెన్స్ లవ్ స్టోరీతో ఎంతవరకు నిలబడతాడో చూడాలి.

Tags:    

Similar News