• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'స్వయంభూ'.. ఓ పనైపోయింది!

'స్వయంభూ'.. ఓ పనైపోయింది!

| 30 రోజుల పాటు శిక్షణ తీసుకున్నట్లు పేర్కొన్నాడు.అక్కడ నగరంలోని రద్దీ రోడ్లపై దిగిన ఫొటోను షేర్ చేశాడు నిఖిల్​.

By - Tupaki Desk
Update: 2023-10-07 16:31 GMT

వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్‌ హీరో నిఖిల్‌. రీసెంట్​గా 'స్పై' అనే మిస్టరీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ప్రస్తుతం పలు విభిన్నమైన చిత్రాలను లైన్​లో పెట్టాడు. అందులో భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో నటిస్తున్న స్వయంభూ ఒకటి.


పీరియాడిక్​ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం.. ఆయుధాలు ఉపయోగించడం, మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు... వియత్నాం వెళ్తున్నట్లు ఆ మధ్యలో నిఖిల్​ చెప్పిన సంగతి తెలిసిందే. నిపుణుల పర్యవేక్షణలో 3 నెలల పాటు శిక్షణ తీసుకోబోతున్నట్లు తెలిపాడు. అయితే తాజాగా వియాత్నంలో మార్షల్ ఆర్ట్స్​ శిక్షణ పూర్తైనట్లు ట్వీట్​ చేశాడు నిఖిల్​.

30 రోజుల పాటు శిక్షణ తీసుకున్నట్లు పేర్కొన్నాడు.అక్కడ నగరంలోని రద్దీ రోడ్లపై దిగిన ఫొటోను షేర్ చేశాడు నిఖిల్​. షూటింగ్​లో మళ్లీ అడుగుపెట్టినట్లు కూడా చెప్పుకొచ్చాడు. ఈ పిక్​లో నిఖిల్​ ఫుల్​ జోష్​లో యమా స్టైలిష్​గా కనిపించాడు. హాఫ్ హ్యాండ్ డిజైన్డ్​ షర్ట్​, బ్లాక్ ఫ్యాంట్​ ధరించి సైడ్​ పోజు ఇచ్చాడు. ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.

కాగా, ఆ మధ్యలో స్వయంభు సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయగా అది నెటిజన్లను, సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంది. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన సంయుక్త మేనన్‌ నటిస్తోంది. నిఖిల్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఠాగూర్ మధు సమర్పణలో భువన్‌, శ్రీకర్‌ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ ఫేం రవి బసుర్ మ్యూజిక్ అందిస్తున్నారు. బింబిసార ఫేం వాసుదేవ్ మున్నెప్పగిరి డైలాగ్స్ అందిస్తున్నారు. మనోజ్‌ పరమహంస ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంతో ఎలాగైనా గట్టి హిట్ అందుకోవాల‌ని నిఖిల్ పట్టుదలతో ఉన్నారు. ఇక ఈ చిత్రంతో పాటు సుధీర్‌ వర్మతోనూ నిఖిల్‌ ఓ సినిమా చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ సమర్పణలో ది ఇండియా హౌస్‌ పేరిట ఇది రూపుదిద్దుకోనుంది. అలాగే చందు మొండేటితో 'కార్తికేయ‌-3'కి కూడా రెడీ అవుతున్నారు నిఖిల్.

Tags:    
  • Actornikhil 
  • Swayambhu 
  • Bharatkrishnamachari 
  • Bhuvan 
  • Ravibasur 
  • Sreekar 

Similar News

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

రాహా బర్త్‌డే స్పెషల్.. చిక్ లుక్‌తో ఆకట్టుకున్న అలియా భట్!

2026-11-07 08:23 GMT

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

2026-11-07 08:22 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

Copyright @2026

Powered by Blink CMS