నిఖిల్ ని హ్యాపీడేస్ హీరో మళ్లీ కలిసాడా?
టాలీవుడ్ లో నిఖిల్, వరుణ్ సందేశ్ ప్రయాణం ఎలా మొదలైందో చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు `హ్యాపీడేస్` తో వెలుగులోకి వచ్చారు.;
టాలీవుడ్ లో నిఖిల్, వరుణ్ సందేశ్ ప్రయాణం ఎలా మొదలైందో చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు `హ్యాపీడేస్` తో వెలుగులోకి వచ్చారు. ఆ సినిమాలో వరుణ్ సందేశ్ మెయిన్ లీడ్ కాగా, నలుగురు ప్రెండ్స్ లో ఒకడిగా నిఖిల్ నటించా డు. కానీ హ్యాపీడేస్ లో అన్ని పాత్రలు ఈక్వల్ గానే హైలైట్ అవుతాయి. ఆ సినిమా విజయంతో వరుణ్ సందేశ్ టాలీవుడ్ లో బిజీ అయ్యాడు. సోలోగా ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. అతడితో పాటు మిగతా వాళ్లు కూడా కొన్ని సినిమాలు చేసారు. కానీ వరుణ్ సందేశ్ లా సక్సెస్ అవ్వలేదు. దీంతో నిఖిల్ మినహా అంతా ఇండస్ట్రీని వదిలేసారు.
వెనుకా మందు సహజమే:
నిఖిల్ అప్పటికే వరుణ్ కంటే ఇండస్ట్రీలో సీనియర్. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనుభవం ఉంది. కానీ ఎదిగే విషయంలో వరుణ్ సందేశ్ త్వరగా క్లిక్ అయ్యాడు. వరుణ్ సినిమాల వేగం చూసి టాలీవుడ్ లో మంచి భవిష్యత్ ఉంటుందని అంతా భావించారు. కానీ అది సాధ్యపడలేదు. ఇప్పుడా భవిష్యత్ నిఖిల్ కు కనిపిస్తుంది. నిఖిల్ ఇప్పటికే సక్సెస్ అయిపోయాడు. వైవిథ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. `స్వామిరారా` విజయం అతడి జీవితాన్నే మార్చేసింది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అయ్యాయి.
మళ్లీ వరుణ్ సందేశ్ యాక్టివ్ గా:
`కార్తికేయ 2` తో ఏకంగా పాన్ ఇండియాలోనూ లాంచ్ అయ్యాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. అతడికన్నా ముందే హీరోగా పని చేసిన వరుణ్ సందేశ్ మాత్రం సినిమాలు లేక ఖాళీగా ఉంటున్నాడు. అందుకే ఇండస్ట్రీ ఎప్పుడు అవకాశాలిస్తుందో? ఇవ్వదో గెస్ చేయడం కష్టం. మరి పాత పరిచయంతో వరుణ్ సందేశ్-నిఖిల్ మళ్లీ కలిసారా? అంటే వరుణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత ఆ విషయం ఎక్కడా వెలుగులోకి రాలేదు. గత రెండేళ్ల కాలంగా వరుణ్ మళ్లీ ఇండస్ట్రీ లో కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్...నిఖిల్ ని కలిసినట్లు సన్ని హిత వర్గాల నుంచి తెలిసింది.
తలుచుకుంటే సాధ్యమే:
ఈ నేపథ్యంలో ఇద్దరు మళ్లీ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరి ఈ మీట్ లో ప్రోఫెషనల్ కెరీర్ గురించి డిస్కషన్ జరిగిందా? లేదా? అన్నది ఇంకా బయ టకు రాలేదు. మరి ఫాంలో ఉన్న నిఖిల్ ని..వరుణ్ లిప్ట్ అడగ కుండా ఉండి ఉంటాడా? అన్న చర్చ ఫిలిం సర్కిల్స్ లో మొదలైంది. నిఖిల్ తలుచుకుంటే స్నేహితుడికి ఒక ఛాన్స్ ఏదో రూపంలో కల్పించగలడు. కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే చాకచక్యమే తెలియాలి.