నిఖిల్ 'స్వయంభూ' ప్లాన్ మారింది.. వచ్చేది ఎప్పుడంటే..

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 20వ చిత్రం 'స్వయంభూ'.;

Update: 2026-01-24 08:28 GMT

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 20వ చిత్రం 'స్వయంభూ'. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కావాల్సి ఉంది. అయితే, షూటింగ్ పనులు ఇప్పటికే పూర్తయినప్పటికీ, చిత్ర బృందం ఈ రిలీజ్ డేట్‌ను మార్చాలని నిర్ణయించుకుంది. లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ఇప్పుడు మరో డేట్ పై గురి పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ వాయిదా వెనుక ఒక బలమైన కారణం ఉంది. 'స్వయంభూ' ఒక చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ సీన్స్ ఎక్కువగానే ఉన్నాయట. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, గ్రాఫిక్స్ పనుల కోసం ఇండియాలోని టాప్ లెవల్ స్టూడియోలు పని చేస్తున్నాయి. క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడకూడదని, ఆడియన్స్ కి ఒక గొప్ప విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

హడావుడిగా సినిమాను రిలీజ్ చేసి విజువల్స్ పట్ల నెగిటివ్ కామేంట్స్ వచ్చే కంటే, మరికొంత సమయం తీసుకుని అవుట్‌పుట్‌ను పక్కాగా సిద్ధం చేయడం మేలని చిత్ర యూనిట్ భావించింది. నిఖిల్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కాలంగా కష్టపడుతున్నారు. ఇందులో ఒక పవర్‌ఫుల్ వారియర్ పాత్రలో కనిపించబోతున్నారు. విజువల్స్ ఈ సినిమాకు అసలు బలం కాబట్టి, వాటికి సరైన మెరుగులు దిద్దడం సినిమా సక్సెస్‌కు చాలా అవసరం.

ఇక ఫైనల్ గా ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలా చేయడం వల్ల ఈ సినిమాకు హాలిడే సీజన్ బాగా కలిసి రానుంది. సమ్మర్ సెలవులు ప్రారంభమయ్యే సమయం కాబట్టి, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడానికి ఇది ఒక మంచి ప్లాన్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారికంగా చిత్ర బృందం నుండి అనౌన్స్ మెంట్ రావాల్సి ఉన్నప్పటికీ, ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం సమ్మర్ రిలీజ్ దాదాపు ఖాయమని వినిపిస్తోంది.

భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'ది రైజ్ ఆఫ్ స్వయంభూ' వీడియో సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. నిఖిల్ గెటప్ సెట్టింగ్స్ చూస్తుంటే మేకర్స్ పడుతున్న శ్రమ స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా 'స్వయంభూ' టీమ్ ఒత్తిడికి లొంగకుండా నాణ్యతకే ప్రాధాన్యత ఇస్తోంది. గ్రాఫిక్స్ పనులు పూర్తి చేసుకుని ఏప్రిల్ లో వస్తున్న ఈ వారియర్ కథ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.

Tags:    

Similar News