సైలెన్స్ ను వీడిన స్వయంభు
ఆ గ్యాప్‌లో మొదలుపెట్టిన ప్రాజెక్టే 'స్వయంభూ'. నిఖిల్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్. ఒక పీరియడ్ యాక్షన్ డ్రామాగా దీన్ని అనౌన్స్ చేసినప్పుడు హైప్ మామూలుగా లేదు.;
'కార్తికేయ 2' రూపంలో నిఖిల్ సిద్ధార్థకు ఎలాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ పడిందో మనందరికీ తెలుసు. ఆ సినిమా దెబ్బకు నిఖిల్ మార్కెట్ ఒక్కసారిగా నేషనల్ లెవల్‌కు వెళ్లిపోయింది. కానీ, ఆ భారీ సక్సెస్ తర్వాత వచ్చిన '18 పేజెస్', 'స్పై' లాంటి సినిమాలు ఆ అంచనాలను అందుకోలేకపోయాయి. ముఖ్యంగా 'స్పై' డిజాస్టర్ అవ్వడంతో, నిఖిల్ తన నెక్స్ట్ స్టెప్ కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు.
ఆ గ్యాప్‌లో మొదలుపెట్టిన ప్రాజెక్టే 'స్వయంభూ'. నిఖిల్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్. ఒక పీరియడ్ యాక్షన్ డ్రామాగా దీన్ని అనౌన్స్ చేసినప్పుడు హైప్ మామూలుగా లేదు. కానీ, ఆ తర్వాత చాలా కాలం ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. దీంతో ఫ్యాన్స్ కూడా కాస్త డల్ అయ్యారు. అసలు సినిమా ఏ స్టేజ్‌లో ఉందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు, ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత, నిఖిల్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ 'స్వయంభూ'ను లైమ్‌లైట్‌లోకి తెచ్చాడు.
"నా కెరీర్‌లోనే ఇది మోస్ట్ ఎక్సైటింగ్ జర్నీ. ఏదో ఎక్స్‌ట్రార్డినరీ సినిమా చేస్తున్నప్పుడు, ఓపిక చాలా ముఖ్యం అని ఈ సినిమా నాకు నేర్పింది" అంటూ ఇన్‌స్టాలో ఒక క్రిప్టిక్ పోస్ట్ పెట్టాడు. ఈ ఒక్క పోస్ట్ చాలు, ఫ్యాన్స్‌లో వైబ్రేషన్స్ స్టార్ట్ అవ్వడానికి. అసలు నిఖిల్ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆ 'అద్భుతం' ఏంటి? ఇంత ఓపిక పట్టారంటే, విషయం చాలా పెద్దదయే ఉండాలి.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఆ 'అద్భుతం' మరేదో కాదు.. సినిమా ఫైనల్ రిలీజ్ డేట్. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసిందని, అందుకే మేకర్స్ ఒక పర్ఫెక్ట్ రిలీజ్ డేట్‌ను లాక్ చేశారని సమాచారం. 2026, ఫిబ్రవరి 14న (వాలెంటైన్స్ డే) ఈ పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారట. అందుకే నిఖిల్ లీడ్ ఇస్తూ ఈ పోస్ట్ పెట్టాడని అంటున్నారు. అయితే, ఈ డేట్‌పై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
నిజానికి 'స్వయంభూ' అనేది నిఖిల్‌కు ఒక బిగ్ టెస్ట్ లాంటిది. ‘కార్తికేయ'తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్‌ను నిలబెట్టుకోవాలంటే, ఈ సినిమా ఆ రేంజ్ మ్యాజిక్‌ను క్రియేట్ చేయాలి. అందుకే నిఖిల్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు టెక్నికల్ టీమ్ సెట్టింగే వేరే లెవల్‌లో ఉంది. 'బాహుబలి', 'RRR' లాంటి విజువల్ వండర్స్‌కు పనిచేసిన కె.కె. సెంథిల్ కుమార్ కెమెరామ్యాన్‌గా పనిచేస్తున్నారు.
మరోవైపు 'KGF', 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ దీనికి మ్యూజిక్ ఇస్తున్నారు. ఎం. ప్రభాహరన్, రవీంద్ర లాంటి టాప్ టెక్నీషియన్స్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. ఈ పేర్లు వింటేనే, ఇది రొటీన్ సినిమా కాదని, నిఖిల్ చెప్పినట్లు నిజంగానే ఏదో 'ఎక్స్‌ట్రార్డినరీ'గా ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది. ఈ టెక్నికల్ టీమ్ సపోర్ట్‌తో, 'స్వయంభూ' కనుక ‘కార్తికేయ 2’ రేంజ్ హిట్టయితే, నిఖిల్ పాన్ ఇండియా మార్కెట్‌లో స్ట్రాంగ్‌గా సెటిల్ అయిపోయినట్లే.