సాలిడ్ లైన‌ప్ తో రాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్ర‌స్తుతం వరుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు.;

Update: 2025-08-30 04:57 GMT

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్ర‌స్తుతం వరుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఇప్పుడాయ‌న చేతిలో మూడు సినిమాలున్నాయి. కార్తికేయ‌2 సినిమాతో త‌న క్రేజ్, మార్కెట్ ను పాన్ ఇండియా స్థాయిలో పెంచుకున్న నిఖిల్ ఆ క్రేజ్ తోనే వ‌రుస సినిమాల‌ను లైన్ లో పెట్టారు. అయితే కార్తికేయ2 తో వ‌చ్చిన స‌క్సెస్ ను నిఖిల్ త‌ర్వాతి సినిమాల‌తో కంటిన్యూ చేయ‌లేక‌పోయారు.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ లో స్వ‌యంభు

మ‌ధ్య‌లో వ‌చ్చిన 18 పేజెస్, స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలు ఫ్లాపుల‌వ‌డంతో త‌ర్వాతి సినిమాల‌తో ఎలాగైనా హిట్లు అందుకోవాల‌ని చాలా క‌సిగా ఉన్నారు నిఖిల్. అందులో భాగంగానే సినిమాలు చేస్తున్న నిఖిల్ ఇప్ప‌టికే స్వ‌యంభు సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. భ‌ర‌త్ కృష్ణ‌మాచారి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ ను ఎంతో వేగంగా జ‌రుపుకుంటుంది.

40% షూటింగ్ పూర్తి చేసుకున్న ది ఇండియ‌న్ హౌస్

స్వ‌యంభు సినిమాను ఇప్ప‌టికే పూర్తి చేసిన నిఖిల్ చేతిలో ది ఇండియా హౌస్ అనే సినిమా కూడా ఉంది. ర‌వి వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెర‌కెక్కుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించిన 40% షూటింగ్ పూర్తైంద‌ని స‌మాచారం. అభిషేక్ అగ‌ర్వాల్ భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ రెండింటితో పాటూ నిఖిల్ చేతిలో మ‌రో సినిమా కూడా ఉంది. సోషియో ఫాంట‌సీ సూప‌ర్ హీరో సినిమాగా రానున్న ఈ మూవీ ఇంకా మొద‌ల‌వ‌లేదు. త్వ‌ర‌లోనే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివ‌రాలు కూడా వెల్ల‌డ‌య్యే అవ‌కాశముంది. మొత్తానికి నిఖిల్ ప‌లు క్రేజీ ప్రాజెక్టుల‌ను లైన్ లో పెట్టి వాటిని పూర్తి చేసే ప‌నిలో చాలా బిజీగా ఉన్నారు. మ‌రి ఈ సినిమాలైనా నిఖిల్ కు కోరుకున్న స‌క్సెస్ ను అందిస్తాయేమో చూడాలి.

Tags:    

Similar News