• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీ అన్ ఫాలో విషయం.....

బన్నీ అన్ ఫాలో విషయం.. నిహారిక అలా అనిందేంటి?

| జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-06-15 04:17 GMT

జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన.. తొలిసారి ఎమ్మెల్యేగా గ్రాండ్ విక్టరీ కొట్టారు. రాష్ట్రంలో కూటమి ఏర్పాటు నుంచి విజయం సాధించడం వరకు గేమ్ ఛేంజర్ గా వ్యవహరించిన పవన్.. డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని పొందారు. దాంతోపాటు తనకు ఇప్పటికే ఆసక్తి ఉన్నట్లు చెప్పిన వివిధ శాఖలకు మంత్రిగా ఐదేళ్లపాటు వ్యవహరించనున్నారు.

అయితే ఎన్నికల ప్రచారం సమయంలో హీరో అల్లు అర్జున్.. పవర్ స్టార్ కు మద్దతుగా పోస్ట్ పెట్టి వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లడం పెద్ద దూమారం రేపింది. నంద్యాలలో వైసీపీ తరఫున పోటీ చేసిన తన స్నేహితుడు శిల్పా రవి ఇంటికి వెళ్లి బన్నీ విషెస్ తెలిపారు. దాన్ని పవన్ ఫ్యాన్స్ తప్పు పట్టారు. సోషల్ మీడియాలో బన్నీ అభిమానులు, పవన్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధమే నడించింది. ఇంతలో నాగబాబు చేసిన ఒక్క ట్వీట్ మరింత అగ్గి రాజేసింది.

ఇక పవన్ గెలిచాక.. చిరంజీవి ఇంట్లో సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. మెగా ఫ్యామిలీ అంతా అటెండ్ అయినా.. అల్లు కుటుంబం నుంచి ఎవరూ కనిపించలేదు. పవన్ ను కలిసి విషెస్ చెప్పినట్లు కూడా ఎక్కడా వార్తలు లేదు. దీంతో రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ పెరిగిందని టాక్ వచ్చింది. అదే సమయంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ తోపాటు స్నేహా రెడ్డిని అన్ ఫాలో చేసినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

దీనిపై మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదు. అయితే నటి కమ్ నిర్మాత నిహారిక కొణిదెల తన సొంత సంస్థ ఎలిఫెంట్ పిక్సర్చ్స్ బ్యానర్ పై కమిటీ కుర్రోళ్ళు సినిమా నిర్మిస్తోంది. ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ తో మీడియాతో పలు విషయాలపై మాట్లాడింది. ఆ సమయంలో ఓ మీడియా రిపోర్టర్.. మెగా ఫ్యామిలీలో ఓ హీరో అల్లు అర్జున్ ను అన్ ఫాలో అయ్యారన్న విషయాన్ని నిహారిక వద్ద ప్రస్తావించారు.

మెగా, అల్లు ఫ్యామిలీలు కలిసే ఉంటాయి, కానీ ఎన్నికల వల్ల డిస్టర్బెన్స్ క్రియేట్ అయిన సమయంలో అన్ ఫాలో చేశారని వార్తలు వస్తున్నాయి.. ఎంత వరకు కరెక్ట్ అని అడిగారు. దానికి నిహారిక.. ఆ విషయం గురించి తనకు నిజంగా తెలియదన్నారు. ఏదేమైనా ఎవరి కారణాలు వారికి కచ్చితంగా ఉంటాయని తెలిపారు. దీంతో నిహారిక వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆ మాటల బట్టి బన్నీని అన్ ఫాలో చేయడం నిజమేనని నెటిజన్లు చెబుతున్నారు.

Tags:    
  • Niharikakonidela 
  • Tollywood 
  • Nagababu 
  • Megafamily 
  • Chiranjeevi 
  • Alluarjun 
  • Saidurgatej 
  • Pawankalyan 
  • Janasena 
  • Committeekurrollu 

Similar News

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS