చీరలో నిహారిక.. అందంతో మాయ చేస్తోందిగా..
లేటెస్ట్ గా నిహారిక షేర్ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.;
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక అమ్మాయిగా, 'మెగా ప్రిన్సెస్'గా నిహారిక కొణిదెల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత నటిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, తన అప్డేట్స్తో ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటుంది.
లేటెస్ట్ గా నిహారిక షేర్ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ రెడ్ కాంబినేషన్లోని సంప్రదాయ చీరలో తెలుగు అమ్మాయిగా పర్ఫెక్ట్ గా మెరిసిపోతోంది. జడలో మల్లెపూలు, చేతికి గాజులతో ఎంతో హుందాగా, ప్రశాంతంగా కనిపిస్తోంది. ఆమె లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
నిహారిక కెరీర్ ప్రయాణం చాలా విభిన్నంగా సాగింది. బుల్లితెరపై యాంకర్‌గా 'ఢీ' వంటి పాపులర్ షోలతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత 'ముద్దపప్పు ఆవకాయ్' వంటి వెబ్ సిరీస్‌తో నటిగా మారి, యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. 'ఒక మనసు' సినిమాతో హీరోయిన్గా వెండితెరకు పరిచయమైంది.
'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించినా, అవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి.
దీంతో, నటనకు కొంచెం విరామం ఇచ్చి, 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే సొంత ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించింది. ఈ బ్యానర్‌పై కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ పలు సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్‌లను నిర్మిస్తోంది. ఇటీవల ఆమె నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక వ్యక్తిగత కారణాలతో కొన్నాళ్లు కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన నిహారిక, ఇప్పుడు మళ్లీ ఫుల్ యాక్టివ్ అయింది. తన ప్రొడక్షన్ హౌస్ పనులతో బిజీగా ఉంటూనే, కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. నటిగా మంచి కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తూనే, నిర్మాతగా తన అభిరుచిని చాటుకోవడానికి సిద్ధమవుతోంది.