31లో కూడా స్టిల్ యంగ్.. ఫిట్నెస్ సీక్రెట్ అదే అంటున్న నిహారిక!

కేవలం హెల్దీ ఫుడ్ మాత్రమే తీసుకుంటారు. అలా తాజాగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో తన డైట్ సీక్రెట్ గురించి బయట పెట్టింది.;

Update: 2025-09-29 06:15 GMT

మెగా డాటర్ నిహారిక తన సీక్రెట్ డైట్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. నేను మూడు పూటలా అవే తింటాను..అందుకే ఇలా ఉన్నాను అంటూ తన సీక్రెట్ డైట్ ని బయట పెట్టింది.మరి ఇంతకీ నిహారిక మూడు పూటలా తినే ఆహారం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది సెలబ్రిటీలు బరువు పెరగకుండా ఉండడం కోసం డైటింగ్ చేస్తూ ఉంటారు. అలా డైట్ లో ఉన్నప్పుడు ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వంటివి తినరు. కేవలం హెల్దీ ఫుడ్ మాత్రమే తీసుకుంటారు. అలా తాజాగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో తన డైట్ సీక్రెట్ గురించి బయట పెట్టింది.

మీరు ఎప్పుడు ఇలాగే కనిపిస్తున్నారు. ఏదైనా సీక్రెట్ డైట్ మెయింటైన్ చేస్తున్నారా అని యాంకర్ అడగగా.."అవును.. డైట్ చేస్తున్నాను. కానీ ఎప్పుడూ డైటింగ్ చేయను.కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే డైటింగ్ చేస్తాను. కానీ ప్రస్తుతం డైట్ లో ఉన్నాను.మూడు పూటలా ఇవి మాత్రమే తింటాను. చికెన్, ప్రత్యేకమైన డైట్ బిర్యాని, గుడ్డు ఈ మూడు మాత్రమే నేను ఆహారంగా తీసుకుంటాను. అలాగే మూడు పూటలా ఇవే తింటాను.ఇక స్మూతీలను కూడా స్కిప్ చేయను. అలాగే రకరకాల స్మూతీలను కూడా తాగను. కేవలం బనానా స్మూతీ,బ్లూ బెర్రీ స్మూతీ ఇవి రెండు మాత్రమే తాగుతాను.

అయితే ఎప్పుడు డైటింగ్ లో ఉండను. సన్నబడ్డాను అనిపిస్తే మళ్లీ డైట్ చేంజ్ చేస్తాను. ఆ మధ్యకాలంలో నేను చాలా బరువు పెరిగిపోయాను.ఆ కారణంగానే జిమ్ కి వెళ్లి వ్యాయామం చేయడం స్టార్ట్ చేశాను. జిమ్ కి వెళ్ళినప్పటి నుండి నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ప్రస్తుతం వ్యాయామం అనేది నా రోజువారి జీవన విధానంలో భాగమైపోయింది. అందుకే జిమ్ కు వెళ్లకుండా ఉండలేకపోతున్నాను. అయితే కొంతమంది నేను లావయ్యాను కాబట్టి సన్నబడడం కోసమే జిమ్ కి వెళ్తున్నాను.ఆ తర్వాత వెళ్లడం మానేస్తాను అనుకుంటున్నారు.కానీ అలా ఎప్పటికీ చేయను. ఎందుకంటే ప్రస్తుతం జిమ్ అనేది నా లైఫ్ లో ఓ పార్ట్ అయ్యింది. చాలా రోజుల నుండి జిమ్ కి వెళ్తూ వ్యాయామం చేస్తున్నాను. ఎప్పటికీ దీన్ని కొనసాగిస్తాను.కానీ డైటింగ్ మాత్రం రాబోయే రోజుల్లో చేంజ్ చేస్తాను". అంటూ తన సీక్రెట్ డైట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టింది నిహారిక.అలా మూడు పూటలా చికెన్, గుడ్డు,ప్రత్యేకమైన డైట్ బిర్యానీ తింటూ తన ఫిజిక్ ని మెయింటైన్ చేస్తోందట.

ఇక జొన్నలగడ్డ చైతన్య నుండి విడాకులు తీసుకున్న నిహారిక కొద్ది రోజులు పేరెంట్స్ దగ్గర ఉండి ప్రస్తుతం వేరే ఇంట్లో ఉంటున్నట్టు ఆ ఇంటర్వ్యూలో తెలియజేసింది. వేరే ఇంట్లో ఉంటున్నానని పేరెంట్స్ తో విభేదాలు వచ్చాయని కాదు. నేను వేరే ఇంట్లో ఉన్నప్పటికీ రెండు రోజులకు ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాను. అలాగే మా అన్నకు కొడుకు పుట్టినప్పటి నుండి వాడితో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నాను. ఒకవేళ వాడు పెద్దయ్యాక హీరో అవుతానంటే నా బ్యానర్ లో వాడిని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తాను.. అంటూ నిహారిక చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News