పిక్‌టాక్‌ : స్టార్స్‌ హీరోయిన్స్‌కి తగ్గకుండా నిహారిక కొణిదెల

తాజాగా నిహారిక షేర్‌ చేసిన ఈ వర్కౌట్‌ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.;

Update: 2025-07-19 12:30 GMT

మెగా ఫ్యామిలీ నుంచి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఏకైక అమ్మాయి నిహారిక. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు అయిన నిహారిక షార్ట్‌ ఫిల్మ్స్‌, బుల్లి తెర నుంచి కెరీర్‌ను ఆరంభించింది. నటిగా ఎన్నో పాత్రల్లో నటించింది. అదృష్టం కలిసి రాకపోవడంతో హీరోయిన్‌గా నటించిన సినిమాలు కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకోలేదు. దాంతో నిహారిక సినిమాలకు కొన్నాళ్లు దూరం అయింది. పెళ్లి, ఇతర వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్న నిహారిక మళ్లీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో సందడి చేసేందుకు సిద్దం అవుతోంది. ప్రస్తుతం నిర్మాతగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఫ్యూచర్‌లో నిహారికను వెండి తెరపై మళ్లీ చూసే అవకాశాలు ఉన్నాయి.

ఆ మధ్య ఒక వెబ్‌ సిరీస్‌లో నటించిన నిహారిక సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని చాలా మంది అభిమానులు, సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతానికి నిహారిక కి ఆ ఆలోచన ఉన్నట్లు లేదు. నిర్మాతగానే సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వర్కౌట్‌ వీడియోలు, ఫోటోలు, పోస్ట్‌ వర్కౌట్‌ వీడియోలు, ఫోటోల కారణంగా నిహారిక హీరోయిన్‌గా నటించాలని చాలా మంది గట్టిగానే డిమాండ్‌ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న చాలా మంది హీరోయిన్స్‌తో పోల్చితే నిహారిక చాలా అందంగా ఉందని, ఆమెకు ఉన్న నటన ప్రతిభ కూడా చాలా మంది హీరోయిన్స్‌లో లేదని అంటున్నారు.

తాజాగా నిహారిక షేర్‌ చేసిన ఈ వర్కౌట్‌ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముందు ముందు ఈమెను నటిగా రీ ఎంట్రీ ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్న వారు చాలా మంది ఈ ఫోటోలకు, వీడియోలకు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్నారు, చాలా మంది హీరోయిన్స్‌తో పోల్చితే చాలా అందంగా ఉన్నారు ఎందుకు మీరు సినిమాల్లో హీరోయిన్‌గా ప్రయత్నాలు చేయడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలుగులో కాకున్నా తమిళ్‌, కన్నడ, మలయాళంలో అయినా మీరు నటిగా ప్రయత్నించాలని కోరుతున్న వారు చాలా మంది ఉన్నారు. తమిళ్‌ లో నిహారిక గట్టిగా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మంచి ఆఫర్లు దక్కుతాయి.

నిహారిక ఫ్యామిలీ నుంచి పూర్తి సహకారం ను కలిగి ఉంది. నాగబాబుతో పాటు చిరంజీవి ఇతర మెగా హీరోలు సైతం ఈమెను నటిగా ఎంకరేజ్‌ చేసేందుకు సిద్ధంగా ఉంటారని టాక్‌. అయినా కూడా నిహారిక ప్రస్తుతానికి నిర్మాణంపైనే దృష్టి పెట్టి ఉంది. త్వరలోనే ఈమె నుంచి బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు నిర్మాతగా రాబోతున్నాయి. నిర్మాతగా తనను తాను నిరూపించుకున్న తర్వాత దర్శకత్వం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు అయినా నిహారిక కనీసం హీరోయిన్‌ ఓరియంటెడ్ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి నిహారిక ఆ దిశగా ఏమైనా ఆలోచిస్తుందా అనేది చూడాలి. నాగబాబు నటనకు దూరంగా ఉండగా, నిహారిక సోదరుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా బిజీగా ఉన్న విషయం తెల్సిందే.

Tags:    

Similar News