• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తేజ సజ్జాతో ప్రభాస్...

తేజ సజ్జాతో ప్రభాస్ బ్యూటీ

| టాలీవుడ్ టాలెంటెడ్ గాయ్ తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తోన్న సినిమానే ‘మిరాయ్’.

By - Tupaki Desk
Update: 2024-11-02 11:30 GMT

అదిరిపోయే టాలెంట్‌తో చిన్న వయసులోనే ఊహించని రీతిలో ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు తేజ సజ్జా. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంతో గొప్ప పేరును తెచ్చుకున్న అతడు.. హీరోగా మారిన తర్వాత కూడా ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా ‘హనుమాన్’తో పాన్ ఇండియా రేంజ్‌లో ఫేమస్ అయిన తేజ సజ్జా.. ఇప్పుడు ‘మిరాయ్’ అనే ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో నటిస్తున్నాడు.

టాలీవుడ్ టాలెంటెడ్ గాయ్ తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తోన్న సినిమానే ‘మిరాయ్’. హాలీవుడ్ రేంజ్ యాక్షన్‌తో రాబోతున్న ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా మొదట్లోనే మంచి హైప్‌ను క్రియేట్ చేసుకుంది. దీనికితోడు ఇందులో మంచు మనోజ్ విలన్‌గా చేస్తుండడంతో ఈ మూవీ కోసం అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ‘మిరాయ్’ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అంతేకాదు, కొద్ది రోజుల్లోనే చాలా వరకూ టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేయాలని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని సన్నాహాలు చేస్తున్నాడు.

హై రేంజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘మిరాయ్’ చిత్రాన్ని మరింతగా హైలైట్ చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగానే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను పెట్టాలని చూస్తున్నట్లు తెలిసింది. దీన్ని ఓ స్టార్ హీరోయిన్‌తో చేయించాలని కార్తీక్ ఘట్టమనేని భావిస్తున్నాడట. ఇందుకోసం చాలా మంది భామల పేర్లను ఇప్పటికే పరిశీలించినట్లు సమాచారం.

ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. ‘మిరాయ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం నిధి అగర్వాల్‌ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలిసింది. అతి త్వరలోనే ఆమె ఈ పాట షూటింగ్‌లో భాగం కాబోతుందని అంటున్నారు. ప్రస్తుతం నిధి అగర్వాల్.. రెబెల్ స్టార్ ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్’, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక, తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న ‘మిరాయ్’ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీని 2025 ఏప్రిల్ 18వ తేదీన విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, చైనీస్ భాషల్లో ఇది రిలీజ్ కాబోతుంది. ఇందులో రితికా నాయక్ హీరోయిన్‌గా చేస్తోంది.

Tags:    
  • Nidhiagarwal 
  • Tejasajja 
  • Mirai 
  • Specialsong 
  • Tollywood 
  • Filmindustry 
  • Hanuman 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS