తొందర ఏం లేదు.. నెటిజన్‌కి నిధి స్వీట్‌ కౌటర్‌

టాలీవుడ్‌లో సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌.;

Update: 2025-04-14 11:31 GMT

టాలీవుడ్‌లో సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. తక్కువ సమయంలోనే ఈ అమ్మడికి ఇస్మార్ట్‌ శంకర్ సినిమాలో నటించే అవకాశం దక్కడంతో పాటు, సూపర్‌ హిట్‌ దక్కింది. ఇస్మార్ట్‌ శంకర్‌ సూపర్‌ హిట్‌ కావడంతో నిధి అగర్వాల్‌ బిజీ కావడం ఖాయం అని అంతా భావించారు. కానీ ఆ సినిమా తర్వాత ఈ అమ్మడు పెద్దగా సినిమాలు చేయలేదు. కరోనా కారణంగా కాస్త బ్రేక్‌ వచ్చిందని అనుకున్నా , ఆ తర్వాత కూడా ఈమె ఎక్కువ సినిమాలు చేయలేక పోయింది. అందుకు కారణం ఏంటి అంటూ చాలా మంది ఈమెను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈమధ్య కాలంలో హీరోయిన్స్ వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు.

సోషల్‌ మీడియాలో అదే విషయంపై కొందరు ఈమెపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నీ తర్వాత వచ్చిన హీరోయిన్స్‌ చాలా మంది నీ కంటే ఎక్కువ సినిమాలు చేశారు. కానీ నువ్వు మాత్రం ఇప్పటికీ సినిమాల సంఖ్యను పెంచలేక పోతున్నావు అంటూ విమర్శిస్తున్నారు. ఇటీవల ఒక నెటిజన్‌ 2021లో వచ్చిన శ్రీలీల ఇప్పటికే దాదాపు 20 సినిమాలు చేసింది. కానీ ఎప్పుడో 2019లో ఇస్మార్ట్‌ శంకర్‌తో విజయాన్ని సొంతం చేసుకున్న నిధి అగర్వాల్‌ మాత్రం ఇప్పటి వరకు చేసిన సినిమాలు చాలా తక్కువ అంటూ ఫన్నీ ఈమోజీని షేర్ చేశాడు. దాంతో నిధి అగర్వాల్‌ స్పందించింది. ఆ ట్వీట్‌కు కౌంటర్‌ ఇచ్చింది.

ఇస్మార్ట్‌ శంకర్ సినిమా తర్వాత హీరో చేసిన సినిమాలు కూడా ఎక్కువ ఏం లేవు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. అంతే కాకుండా నేను 3 తమిళ సినిమాలు చేశాను. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ మూవీ హరి హర వీరమల్లు సినిమాను చేస్తున్నట్లు గా చెప్పుకొచ్చింది. సినిమాల సంఖ్య ఎక్కువ పెంచుకోవడం కంటే ఎక్కువ మంచి సినిమాలు చేయాలని ఉద్దేశంతో తాను ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. నా గురించి ఎక్కువ ఆందోళన అవసరం లేదు. తొందర పడాలని నేను అనుకోవడం లేదు. తొందర పడటం వల్ల ఫలితం తారు మారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక మెల్లగానే ఎక్కువ కాలం సినిమాలు చేయాలని నేను అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

ప్రభాస్‌తో రాజాసాబ్‌ సినిమాలోనూ ఈమె నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు పెద్ద హీరోల సినిమాలు కావడంతో కచ్చితంగా ఈ అమ్మడు ముందు ముందు పెద్ద సినిమాలు మరిన్ని చేయడంతో పాటు, పలువురు పెద్ద హీరోల సినిమాలను చేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్‌ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కనుక ఈమెకు రాజాసాబ్‌, హరి హర వీరమల్లు సినిమాలు హిట్ అయితే వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు దక్కవచ్చు. ఆ సమయం కోసం ఈ అమ్మడు వెయిట్‌ చేస్తోంది. తొందర పడకుండా మెల్లగానే సినిమాలు చేస్తానంటోంది.

Tags:    

Similar News