మీ అమ్మగారితో మాట్లాడుతా.. పెళ్లి ప్రపోజల్‌కి నిధి రియాక్షన్‌

సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు అభిమానులతో ముచ్చటించడం మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం.;

Update: 2025-07-08 06:14 GMT

సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు అభిమానులతో ముచ్చటించడం మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. ప్రతి హీరోయిన్‌ చిట్‌ చాట్‌లో ఏదో ఒక ఫన్నీ మెసేజ్‌ లేదంటే కోపం తెప్పించే కామెంట్‌ చూస్తూనే ఉంటాం. కొందరు హీరోయిన్స్ కోపం తెప్పించే విధంగా అభిమానులు కామెంట్స్ చేసిన, అసభ్యంగా ప్రశ్నించినా కూడా కూల్‌గానే ఉంటారు. కొందరు వాటిని లైట్‌ తీసుకుని వదిలేస్తే, కొందరు మాత్రం వాటికి ఫన్నీగా సమాధానం ఇస్తారు, కొద్ది మంది మాత్రమే వాటికి సీరియస్‌గా స్పందిస్తారు. ఆ మధ్య ఒక హీరోయిన్‌ను పెళ్లి చేసుకుందాం అంటూ ఒక అభిమాని సోషల్‌ మీడియా చిట్‌ చాట్‌ సమయంలో అడిగాడు. అందుకు ఆ హీరోయిన్‌ లైట్‌గానే తీసుకుని సరదాగా రిప్లై ఇచ్చింది.


తాజాగా అందాల నిధి అగర్వాల్‌ సోషల్‌ మీడియాలో అభిమానులతో ఆస్క్‌ నిధి అంటూ చిట్‌ చాట్‌ చేసింది. అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. చాలా మంది మీరు చాలా అందంగా ఉంటారు, మీ సినిమాలు బాగుంటాయని చెప్పుకొచ్చారు. కొందరు మీ సినిమాలు ఏంటి, మీ పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించారు. ఇక ఆకతాయిలు కొందరు మిమ్ముల్ని ప్రేమిస్తున్నాను అంటూ కామెంట్‌ చేయడం, మీ సమాధానం ఏంటి అంటూ ప్రశ్నించడం చేశారు. వాటిల్లో కొన్నింటిని తీసుకుని నిధి అగర్వాల్‌ తనదైన శైలిలో సమాధానం ఇవ్వడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. నిధి అగర్వాల్‌ ను ఒక అభిమాని మాత్రం.. మీ అమ్మగారి ఫోన్ నెంబర్‌ ఇస్తే మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతా' అన్నాడు.

అభిమానుల నుంచి అప్పుడప్పుడు ఇలాంటి ప్రశ్నలు, ఫన్నీ కామెంట్స్‌, పెళ్లి గురించిన ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. వాటికి హీరోయిన్స్ సీరియస్‌గా స్పందించకుండా సింపుల్‌గా నవ్వి ఊరుకుంటే సరిపోతుంది. హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ సైతం సింపుల్‌గా సమాధానం ఇచ్చింది. అతడి ప్రశ్నకు.. అవునా... నాటీ అంటూ క్యూట్‌గా రియాక్ట్‌ అవ్వడంతో అంతా నిధి అగర్వాల్‌ను అభినందిస్తున్నారు. ఇలాంటి రియాక్షన్‌ను అతడు కూడా ఊహించి ఉండదు. అతడి కామెంట్‌కు సమాధానం రావడంతో ఫుల్‌ హ్యాపీ ఫీల్‌ అవుతూ ఉంటాడు. నాటీ అంటూ క్యూట్‌గా అతడిని సంభోదించడంతో నిధి అగర్వాల్‌ మంచి మనసును చాలా మంది అభినందిస్తున్నారు.

నిధి అగర్వాల్‌ నటించిన 'హరి హర వీరమల్లు' సినిమా ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగానే నిధి అగర్వాల్‌ అభిమానులతో చిట్‌ చాట్‌ చేసింది. పవన్‌ కళ్యాణ్‌తో సినిమా కావడంతో ఈ సినిమాపై అందాల నిధి చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్‌ అయితే టాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీ హీరోయిన్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇదే ఏడాదిలో ప్రభాస్‌తో నటిస్తున్న రాజాసాబ్‌ సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు నిధి అగర్వాల్‌ రాబోతుంది. ఆ సినిమా హిట్‌ అయ్యి, తన పాత్రకు గుర్తింపు లభిస్తే పాన్‌ ఇండియా రేంజ్లో నిధి అగర్వాల్‌ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ 2025 సంవత్సరం నిధి అగర్వాల్‌ కి అత్యంత కీలకం. మరి ఆమె లక్‌ ఈ ఏడాదితో మారుతుందా అనేది చూడాలి.

Tags:    

Similar News