సుజీత్ దెబ్బకు రాధికకు భారీ నష్టం.. అసలేం జరిగిందంటే?

నిజానికి బ్యాంకాక్ లో చిత్రీకరించబడిన ఈ పాటను పవన్ కళ్యాణ్ ఓజీ రెండవ భాగంలో చూపించాలని మొదట మేకర్స్ అనుకున్నారట.;

Update: 2025-10-09 04:52 GMT

డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది నేహా శెట్టి.. ముఖ్యంగా రాధిక అనే క్యారెక్టర్ ఈమెకు ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ను అందించి పెట్టింది. అలాంటి ఈమె సుజీత్ కారణంగా స్టార్ స్టేటస్ కోల్పోయింది అంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా.. సాహో సినిమాతో డైరెక్టర్గా మంచి పేరు దక్కించుకున్న సుజీత్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఓజీ. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 25వ తేదీన విడుదలై మొదటి రోజు మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. కానీ ఆ తర్వాత రోజుల్లో క్రమంగా థియేటర్లకు ఆడియన్స్ రావడం మానేశారు. దాంతో కలెక్షన్లు కూడా బాగా తగ్గిపోయాయి. మరోవైపు రాధిక క్యారెక్టర్ తో భారీ పాపులారిటీ సంపాదించుకున్న నేహా శెట్టితో ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ రూపొందించిన విషయం తెలిసిందే. అయితే మొదట దీనిని గాసిప్ గానే చెప్పారు. కానీ అధికారికంగా ప్రకటించలేదు. దీంతో నేహా శెట్టితో ఎటువంటి స్పెషల్ సాంగ్ చేయించలేదు అని అందరూ అనుకున్నారు.

కానీ నేహా శెట్టితో ఈ సినిమా కోసం ఒక స్పెషల్ సాంగ్ చేశారు. అంతేకాదు నేహా శెట్టి కూడా తన కెరియర్లో తొలిసారి "కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్" అనే పాటతో ఐటమ్ నంబర్లలోకి అడుగు పెట్టింది. సాధారణంగా ఇటువంటి పాటలు అటు సినిమాకే కాదు.. ఆ పాటలు చేసిన హీరోయిన్స్ కి కూడా మంచి విజయాన్ని అందిస్తాయి. కానీ ఈ పాట చేసిన నేహా శెట్టికి మాత్రం ఈ పాట ఎటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది.

నిజానికి బ్యాంకాక్ లో చిత్రీకరించబడిన ఈ పాటను పవన్ కళ్యాణ్ ఓజీ రెండవ భాగంలో చూపించాలని మొదట మేకర్స్ అనుకున్నారట. అయితే దర్శకుడు సుజీత్, ఎడిటర్ నవీన్ మాత్రం కథకు అంతరాయం కలుగుతుందని భావించి, నిర్మాత అభ్యంతరం వ్యక్తం చేసినా దానిని తొలగించాలని భావించారు. అలా మొదటి భాగం నుండి పాటను తీసేశారు. కానీ థియేటర్లో విడుదలైన ఓజీ సినిమా.. మొదటి రెండు రోజులు బాగానే కలెక్షన్స్ వసూలు చేసినా.. ఆ తర్వాత కలెక్షన్లు మాత్రం రాలేదు. దీంతో అభిమానుల అభ్యర్థన మేరకు అయిష్టంగానే ఐదు రోజుల తర్వాత ఈ పాటను తిరిగి సినిమాలో జోడించారు. దురదృష్టవశాత్తు ఆలస్యంగా చేర్చడం వల్ల ఈ పాట పెద్దగా ప్రభావితం చూపించలేకపోయింది. దీనికి తోడు ఈ పాట చిత్రీకరణ అనవసరం అనిపించేలా చేసిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మొత్తానికైతే భారీ ఖర్చుతో బ్యాంకాక్ లో ఈ "కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్" పాటను చిత్రీకరించినప్పటికీ.. ఆలస్యంగా సినిమాలో చేర్చడం వల్ల పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ పాట కోసం నేహా శెట్టి పడిన కష్టమంతా కూడా వృధా అయిపోయింది. ఒకవేళ అనుకున్నట్టుగా సినిమా విడుదల సమయానికే ఈ పాటను చేర్చి ఉండుంటే కొంతమేర కలిసి వచ్చేదని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కథకు ఇబ్బంది అని పాటను సినిమా నుండి తొలగించి.. సుజీత్ చేసిన పని వల్ల నేహా శెట్టి గొప్ప క్రేజ్ కోల్పోయింది అని అభిమానులు నిట్టూరుస్తున్నారు. ఏదేమైనా సుజీత్ చేసిన పని వల్ల నేహా శెట్టి తొలి ప్రయత్నం విఫలమయ్యింది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News