కిస్సిక్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న నేహా శర్మ.. ఫొటోస్ వైరల్!

తాజాగా ఈ ఫోటోలలో కిస్సిక్ అనిపించేలా ఫోజులిచ్చింది అంటూ ఈ ఫోటోలు చూసిన అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.;

Update: 2026-04-30 18:18 GMT

ఇటీవల కాలంలో హీరోయిన్లు ఒకరి తరువాత ఒకరు అందాలతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరికొంతమంది చేసేది ఒకటి రెండు సినిమాలే అయినా ఆ సినిమాలతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో నేహా శర్మ కూడా ఒకరు. రామ్ చరణ్ హీరోగా నటించిన చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. అలా ఒక్క సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చిన ఈమె ఆ తర్వాత కుర్రాడు అనే సినిమాలో నటించి, మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకుంది.

 

అలా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న నేహా శర్మ.. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఫోటోలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఈ ఫోటోలలో కిస్సిక్ అనిపించేలా ఫోజులిచ్చింది అంటూ ఈ ఫోటోలు చూసిన అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. క్రీమ్ కలర్ నైటీను తలపించేలా షార్ట్ డ్రెస్ ధరించి.. అందులో అందాలు ఆరబోస్తూ విభిన్నమైన ఫోజులిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. మొత్తానికి అయితే సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఇలా సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

 

నేహా శర్మ విషయానికి వస్తే 1987 నవంబర్ 21న బీహార్ లోని భాగల్పూర్ లో జన్మించింది. ఈమె తండ్రి అజిత్ శర్మ వ్యాపారవేత్త, రాజకీయ నాయకులు కూడా.. భగల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక నేహా శర్మ బీహార్ లోని మౌంట్ కర్మల్ లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసిన ఈమె న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కళాశాలలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు కూడా పూర్తి చేసింది

 

చిన్న వయసులోనే ఆస్తమా వ్యాధితో ఇబ్బంది పడ్డ ఈమెకి.. ఈ వ్యాధి నుంచి బయటపడడానికి హైదరాబాద్ కి చెందిన కుటుంబం సహాయపడింది అనే కామెంట్లు గతంలో చేసింది. ఇకపోతే ఈమె సోదరీ ఆయిషా శర్మ కూడా నటిగా కెరియర్ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈమె 2018 లో వచ్చిన సత్యమేవ జయతే సినిమాలో నటించినది.

ఇకపోతే చిరుత , కుర్రాడు సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు. హిందీలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నేహా శర్మ.. ఇప్పుడిలా అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేయడంతో మళ్లీ హీరోయిన్గా తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.. మరి అమ్మడికి ఆ అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో చూడాలి.

Tags:    

Similar News