జ్యోతిక సంచలన పోస్ట్.. వారికి హ్యాట్సాఫ్!
తాజాగా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా పెట్టిన పోస్ట్ అందరిని ఆలోచింపచేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు అవసరమని ఆమె తెలిపింది.
కొన్ని రోజులుగా నీట్ పరీక్షల వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ విషయంపై పలువురు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ.. విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. ఢిల్లీ మొదలుకొని కేరళ వరకు ఎంతో మంది సెలబ్రిటీలు విద్యార్థులకు మద్దతు పలుకుతున్నారు. అటు సల్మాన్ ఖాన్ ను మొదలుకొని ఇటు గౌరీ జి కిషన్ వరకు ప్రతి ఒక్కరూ నిరసన వ్యక్తం చేస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే సీజీపీ డిమాండ్ కి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు పోస్టర్లు పట్టుకొని ప్రదర్శన కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో నటి సంచలన పోస్ట్ చేస్తూ.. జెన్ జీ కిడ్స్ కి హ్యాట్సాఫ్ చెప్పేసింది. మరి అసలు విషయం ఏమిటి? ఆమె తన పోస్ట్ లో ఏం చెప్పింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
తాజాగా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా పెట్టిన పోస్ట్ అందరిని ఆలోచింపచేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు అవసరమని ఆమె తెలిపింది. అందులో భాగంగానే "జై హింద్" అంటూ తన సందేశాన్ని ప్రారంభించిన జ్యోతిక.. "దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల కోసం నేను నా గొంతును వినిపిస్తున్నాను. విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే పారదర్శకతో పాటు బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవాలి. విద్యా వ్యవస్థలో చోటు చేసుకున్న పరిణామాలకు బాధ్యత వహిస్తూ.. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, విద్యార్థుల భవిష్యత్తు కోసం సంస్కరణలు అత్యవసరం విద్యార్థుల ఉద్యమంలో పాల్గొంటున్న సామాజిక కార్యకర్తలు సోనమ్ వాంగ్ చుక్, అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్ సేవలు చాలా గొప్పవి. మేము తల్లులుగా మా పిల్లలను వీరి లాగే పెంచాలి.
ఒక తల్లిగా, నా పిల్లలు కూడా సమాజం కోసం నిలబడే విధంగా విలువలను నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇక జెన్జీ యువత ఏమాత్రం భయపడకుండా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉద్యమంలో పాల్గొనడం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది . తమ హక్కుల కోసం పోరాడుతున్న తీరు ప్రశంసనీయం " అంటూ జ్యోతిక చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా విద్యా వ్యవస్థ బాగుపడితే దేశం అభివృద్ధి చెందుతుంది అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది.
జ్యోతిక సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తూ ఉంటుంది. గతంలో కూడా విద్య, మహిళా సాధికారత, సామాజిక బాధ్యత వంటి అంశాలపై కూడా గతంలో తన అభిప్రాయాలను ఆమె వెల్లడించింది.