• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సలార్.. ఎంత షాక్ ఇచ్చావ్...

సలార్.. ఎంత షాక్ ఇచ్చావ్ నీల్ బ్రో..

| అయితే రీసెంట్ గా దర్శకుడు ప్రశాంత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే సలార్ కు KGF కథకు ఏమాత్రం సంబంధం లేదు అని కుండబద్దలు కొట్టేశారు.

By - Tupaki Desk
Update: 2023-11-29 11:40 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈసారి సలార్ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలి అని అతని ఫాన్స్ అయితే ఎంతో బలంగా కోరుకుంటున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు ఫెయిల్యూర్ అనేది చూడలేదు. అంతేకాకుండా కేజిఎఫ్ సినిమా బాక్సాఫీస్ వద్ద వేలకోట్ల రికార్డులతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాబట్టి అతని మీద నమ్మకంతో ఉన్న ఫ్యాన్స్ కు ఈ సినిమా ఎన్నో ఆశలు కలిగిస్తుంది.

అయితే దర్శకుడు ప్రశాంత్ ఈ సినిమా కథపై కూడా ఇటీవల ఒక క్లారిటీ ఇచ్చాడు ఈ సినిమాలో ఇద్దరి స్నేహితుల మధ్య ఉండే విరోధం హైలెట్ అవుతుందని, అంటే ప్రభాస్ తో పాటు మరో క్యారెక్టర్ పృధ్విరాజ్ సుకుమార్ మధ్యలోనే అసలైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి అని తెలుస్తోంది. ఇక ప్రభాస్ రెండు పాత్రలలో చేస్తున్నారా లేదా అనే విషయంపై కొంతమంది సస్పెన్స్ అయితే క్రియేట్ చేశారు.

ముందుగా వచ్చిన టాక్ ప్రకారం అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఫాదర్ పాత్రలో కూడా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక మరొక షాక్ ఇచ్చే విషయం ఏమిటి అంట ఈ సినిమాలో దర్శకుడు ప్రశాంత్ నీల్ మల్టివర్స్ తరహాలో KGF యశ్ ను చూపించబోతున్నారు అని టాక్ వినిపించింది. అంతే కాకుండా అప్పుడప్పుడు కొన్ని లీక్స్ కూడా వచ్చాయి.

అయితే రీసెంట్ గా దర్శకుడు ప్రశాంత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే సలార్ కు KGF కథకు ఏమాత్రం సంబంధం లేదు అని కుండబద్దలు కొట్టేశారు. ఏ మాత్రం సంబంధం ఉండదు అని ఈ రెండు కూడా డిఫరెంట్ కథలు అని తేల్చి చెప్పేయడంతో ఫాన్స్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొనటి వరకు కూడా ఫ్యాన్స్ అయితే ఇది డైరెక్టర్ ప్రశాంత్ యూనివర్స్ లా ఉండబోతుంది అని ఎన్నో అంశాలు పెంచుకున్నారు.

ఒకవైపు యశ్ మరొకవైపు ప్రభాస్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుందో చూడాలని అనుకున్నారు. కానీ వాళ్ళ ఆశలపై దర్శకుడు ప్రశాంత్ నీల్ నీళ్ళు పోసినట్లు అయ్యింది. నీల్ బ్రో ఈ రేంజ్ లో షాక్ ఇస్తాడు అనుకోలేదు అని సోషల్ మీడియాలో మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. మరి ఈ తరహా క్లారిటీ రావడం వలన సలార్ సినిమా కలెక్షన్స్ పై ఏమైనా ఇంపాక్ట్ పడుతుందో లేదో చూడాలి. ఏదేమైనా కూడా సలార్ సినిమా మాత్రం ప్రభాస్ తప్పనిసరిగా సక్సెస్ కొట్టాల్సిన అవసరం ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Prasanthneel 
  • Prabhas 
  • Salaar 
  • Salaarmovie 
  • Kgf 
  • Story 
  • Universe 
  • Interview 

Similar News

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

Copyright @2026

Powered by Blink CMS