• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  NBK 109: అతనైతే 10 కోట్లు...

NBK 109: అతనైతే 10 కోట్లు ఇవ్వాలట!

| అయితే లిస్టులో మాత్రం మొదట అనిరుద్ రవిచంద్రన్ ను అనుకున్నారు. కానీ అతను ప్రస్తుతం ఒక సినిమాకు 10 కోట్ల రేంజ్ లో పారిపోషకం డిమాండ్ చేస్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2023-11-08 11:30 GMT

నందమూరి బాలకృష్ణ దసరాకు భగవంత్ కేసరి సినిమాతో మరొక మంచి సక్సెస్ అందుకొని ఇప్పుడు తన 109 సినిమాలో స్టార్ చేశాడు. బాబీ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే స్క్రిప్ట్ పనులతో పాటు ప్రీ ప్రొడక్షన్ల కోసం కాస్త ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు బాబి మొత్తానికి నేడు సినిమా రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ చేశాడు.

ఇక ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా దాదాపు మూడు వారాల పాటు మొదటి షెడ్యూల్ ను కొనసాగించాలని అనుకుంటున్నారు. అయితే ఇంకా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని విషయాలపై తుది నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే విషయంలో కూడా చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ ఫార్చూన్ ఫోర్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని సెలెక్ట్ చేయాలి అనే విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. అయితే లిస్టులో మాత్రం మొదట అనిరుద్ రవిచంద్రన్ ను అనుకున్నారు. కానీ అతను ప్రస్తుతం ఒక సినిమాకు 10 కోట్ల రేంజ్ లో పారిపోషకం డిమాండ్ చేస్తున్నాడు. అంటే ఈ సినిమా దర్శకుడు బాబీ కంటే అతడికే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇక మరొక ఆప్షన్ గా దేవి శ్రీ ప్రసాద్ పేరు కూడా చర్చల్లోకి వచ్చింది. ప్రస్తుతం దేవి చాలా బిజీగానే ఉన్నప్పటికీ మిగతా ఆఫర్లను కూడా రిజెక్ట్ చేయడం లేదు. మంచి సినిమాలు వస్తే చేయడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇక దేవిశ్రీప్రసాద్ రెమ్యునరేషన్ ప్రస్తుతం ఐదు కోట్ల రేంజ్ లో అయితే నడుస్తుంది.

డీల్ కుదిరితే దేవిని ఫిక్స్ చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా డైరెక్టర్ కాంబినేషన్ లో దేవి గతంలో మంచి మ్యూజిక్ అందించాడు. వాల్తేరు వీరయ్యకు కూడా డిఎస్పి మ్యూజిక్ ఇచ్చాడు. ఇక బాలయ్య బాబు లెజెండ్ సినిమాకు దేవి వర్క్ చేసిన విషయం తెలిసిందే. మరి ఫైనల్ గా 109 సినిమాకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అవుతాడో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Balakrishna 
  • Bobbydirector 
  • Nbk109 
  • Musicdirector 
  • Anirudh 
  • Devisriprasad 
  • Remuneration 

Similar News

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS