వైరల్ అవుతున్న NBK111 సెట్స్ పిక్.. మూవీపై పెరుగుతున్న అంచనాలు!

గోపీచంద్ మలినేని గత సినిమాల్లో మాస్ ఎలివేషన్స్‌ను ఎలా హ్యాండిల్ చేశారో తెలిసిందే. ఈసారి కూడా బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చూపించేందుకు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నార‌ని సమాచారం.

Update: 2026-05-14 06:29 GMT

నందమూరి నటసింహం బాల‌కృష్ణ హీరోగా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని తెరకెక్కిస్తున్న NBK111 ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తి రేపుతున్న ప్రాజెక్టులలో ఒకటిగా మారింది. వీరసింహారెడ్డి తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడం, భారీ మాస్ ఎంటర్టైనర్‌గా సినిమా రూపొందుతుండటంతో అభిమానుల్లో అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు స్పెషల్ ఐటెం సాంగ్ షూట్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ సాంగ్ కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ కంపోజ్ చేసిన ట్యూన్‌పై ఇండస్ట్రీ వర్గాల్లోనే కాకుండా ఫ్యాన్స్ సర్కిల్స్‌లో కూడా భారీ చర్చ నడుస్తోంది. అఖండ, వీరసింహారెడ్డి సినిమాల్లో బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా థమన్ ఇచ్చిన మాస్ బీట్స్ ఎలా సంచలనం సృష్టించాయో తెలిసిందే. ఇప్పుడు NBK111 కోసం కూడా అదే స్థాయి ఎనర్జీతో థమన్ ఓ పవర్‌ఫుల్ ఐటెం నెంబర్ సిద్ధం చేశార‌నే టాక్ వినిపిస్తోంది.

ఇటీవల ఈ షూటింగ్‌కు సంబంధించిన సెట్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్ షేర్ చేసిన ఓ స్టైలిష్ పిక్ ప్రస్తుతం అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ఆ ఫోటోలో కనిపించిన సెట్స్ డిజైన్, లైటింగ్ ప్యాటర్న్ అన్నీ కలిపి సినిమాలో విజువల్ గ్రాండియర్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో సూచిస్తున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

గోపీచంద్ మలినేని గత సినిమాల్లో మాస్ ఎలివేషన్స్‌ను ఎలా హ్యాండిల్ చేశారో తెలిసిందే. ఈసారి కూడా బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చూపించేందుకు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నార‌ని సమాచారం. ముఖ్యంగా సముద్రఖని- బాలయ్య మధ్య వచ్చే సీన్స్ సినిమాకు కీలక హైలైట్ అవుతాయని, ఇప్పటికే షూట్ చేసిన కొన్ని ఎపిసోడ్ల అవుట్‌పుట్‌పై మేకర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా నటించడం మ‌రో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా మారింది. భగవంత్ కేసరి తర్వాత బాలయ్య- కాజల్ జోడీ మళ్లీ తెరపై కనిపించబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. గత సినిమాలో వీరిద్దరి మధ్య కనిపించిన స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ రావడంతో NBK111లో కూడా వారి ట్రాక్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. కాజల్ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథలో భావోద్వేగాలను మోసేలా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఇప్పటికే #NBK111 హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుండగా, టైటిల్ అనౌన్స్‌మెంట్, ఫస్ట్ లుక్, టీజర్ ఎప్పుడు వస్తాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో మరో మాస్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రధాన చర్చగా మారింది.

Tags:    

Similar News