న‌టనా రంగంలో ఇమేజ్ స‌మ‌స్య ఎంత పెద్ద‌ది అంటే?

ఈ ముస్లిమ్ న‌టి ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు ర‌ణ‌బీర్ క‌పూర్ త‌ల్లిగారైన నీతు కపూర్‌కు ప్రాణ స్నేహితురాలిగా సుప్ర‌సిద్ధురాలు.;

Update: 2025-09-06 03:00 GMT

ఈ ముస్లిమ్ న‌టి ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు ర‌ణ‌బీర్ క‌పూర్ త‌ల్లిగారైన నీతు కపూర్‌కు ప్రాణ స్నేహితురాలిగా సుప్ర‌సిద్ధురాలు. పేరు నజ్నీన్. కానీ నీతూ క‌పూర్ గురించి మాట్లాడుకున్నంత కాక‌పోయినా క‌నీసం నీతూ స్నేహితురాలు న‌జ్నీన్ అనే మాట కూడా ఎప్పుడూ వినిపించిందే లేదు. అయితే ఆమె పేరు క‌నీస మాత్రంగా అయినా గుర్తుండ‌క‌పోవ‌డానికి కార‌ణం.. చాలా కాలంగా న‌ట‌నా రంగం నుంచి ఆమె అదృశ్య‌మ‌వ్వ‌డ‌మే. న‌జ్నీన్ ఒక సినిమాలో లేదా టీవీ షోలో కనిపించి దాదాపు 37 సంవత్సరాలు అయ్యింది. ఈ వెట‌ర‌న్ న‌టి ఎక్కడ ఉందో, ఎలా ఉందో.. ఎవ‌రికీ తెలీదు. ఆమె పరిశ్రమను శాశ్వతంగా విడిచిపెట్టిందా లేదా అనేదీ ఎవరికీ తెలియదు.

న‌జ్నీన్ 90ల‌లో ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించారు. టెలివిజ‌న్ న‌టిగాను గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే బిఆర్ చోప్రా మ‌హాభార‌తంలో కుంతి పాత్ర‌తో గొప్ప ఖ్యాతిని ఘ‌డించారు. పాండ‌వుల త‌ల్లి కుంతీ మాత‌గా ఒక ముస్లిమ్ యువ‌తి న‌ట‌న‌ను ప్ర‌పంచం ప్రేమించింది. న‌జ్నీన్‌ని కొనియాడ‌ని వారు లేరు. `మ‌హాభార‌తం` కోవిడ్ 19 స‌మ‌యంలో రీటెలీకాస్ట్ అయిన‌ప్పుడు గొప్ప ఆద‌ర‌ణ పొందింది. అప్పుడు కూడా కుంతి పాత్ర‌ధారి న‌జ్నీన్ ని నాటి త‌రం గుర్తించింది.

అయితే నజ్నీన్, పాండవుల తల్లి మాతా కుంతిగా హృద‌యాల‌లో నిలిచి ఉన్నా కానీ, దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రజలకు ఆమె ఎక్క‌డ ఉందో తెలియ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఆమె ఎక్క‌డ ఉన్నారు? ఏమైపోయారు? అంటూ ఆరాలు తీస్తూనే ఉన్నారు. మ‌హాభార‌తం కంటే ముందే న‌జ్నీన్ స‌హాయ న‌టిగా బిజీ ఆర్టిస్ట్. చాలా హిందీ చిత్రాల్లో హీరోయిన్ సోదరిగా, స్నేహితురాలిగా నటించింది. వాస్తవానికి ఈ న‌టి జయా బచ్చన్‌ను పోలి ఉండటం వల్ల బాగా గుర్తింపు పొందింది. దర్శకుడు సత్యేన్ బోస్ తన తొలి చిత్రం `సరేగమప`లో న‌జ్నీన్ ఎక్కువగా ఆ పోలిక కారణంగానే ఎంపిక చేశారు. ఆ త‌ర్వాత కూడా జయా బచ్చన్ సోదరి పాత్రలలోనే త‌న‌ను ఎంపిక చేసారు.

న‌జ్నీన్ నిజానికి బాలీవుడ్ లో హీరోయిన్ అవ్వాల‌ని, ప్ర‌ముఖ న‌టిగా స్థిర‌ప‌డాల‌ని కోరుకున్నారు. కానీ త‌న‌కు ఎప్పుడూ స‌హాయక పాత్ర‌ల్లోనే అవ‌కాశాలొచ్చాయి. సోద‌రి, స్నేహితురాలి పాత్ర‌ల్లోనే అవ‌కాశాలొచ్చాయి. తానొక‌టి త‌లిస్తే విధి వేరొక విధంగా త‌ల‌చింద‌ని నెమ్మదిగా అర్థ‌మైంది. అయితే న‌జ్నీన్ కెరీర్ లో కీల‌క మ‌లుపు బి-గ్రేడ్ చిత్రాల్లో న‌టించ‌డం. అవ‌కాశాల కోసం చాలా దిగి వ‌చ్చి నాశిర‌కం, ఎక్స్ పోజ్ చేసే చిత్రాల్లో న‌టించింది. అయితే బి గ్రేడ్ చిత్రాల్లో న‌టించిన త‌ర్వాత ఆ ఆమేజ్ కార‌ణంగా తిరిగి ప్ర‌ధాన స్ర‌వంతి చిత్రాల్లో న‌టించే అవ‌కాశాల‌ను దాదాపుగా కోల్పోయింది. 1976 రొమాంటిక్ థ్రిల్లర్ చల్తే చల్తేలో నటించిన తర్వాత అలాంటి ఒక చిత్రం విడుదలైన తర్వాత, ఆమె ఇమేజ్ మారిపోయింది. డీసెంట్ పాత్రలను ద‌క్కించుకోవ‌డంలో ఇబ్బంది పడింది. అప్ప‌టికే సైడ్ క్యారెక్ట‌ర్ ఇమేజ్ స్థిర‌ప‌డిపోవ‌డంతో దాని నుంచి న‌జ్నీన్ బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోయింది. అందుకే ప‌రిశ్ర‌మలో ఒక ముద్ర ప‌డితే దాని నుంచి త‌ప్పించుకోవ‌డం చాలా క‌ష్టం. అలాగే ఈ రంగంలో దీపం ఉండ‌గానే ఏదైనా చేయాలి. క్యారెక్ట‌ర్ న‌టి స్థాయి నుంచి కిందికి దిగి బి గ్రేడ్ సినిమాలు చేసిన ఈ బ్యూటీ క‌థానాయిక‌గా రాణించేందుకు స‌రైన స‌మ‌యంలో స‌రైన ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. మారిన ఇమేజ్ పెద్ద దెబ్బ కొట్టింది.

Tags:    

Similar News