నయనతార & విగ్నేష్ యానివర్సరీ స్పెషల్.. వెనిస్ వీధుల్లో లవ్ బర్డ్స్ హంగామా!
ఈ యానివర్సరీ ఫొటోల్లో నయనతార స్టైలిష్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ట్రిప్‌లో నయనతార లైట్-వాష్ డెనిమ్ రోంపర్ ధరించి చాలా కూల్‌గా కనిపించింది.
సౌత్‌లో ‘లేడీ సూపర్ స్టార్ నయనతార, తన భర్త విఘ్నేష్ కలిసి పెళ్లి వార్షికోత్సవాన్ని గ్రాండ్‌గా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. "హ్యాపీ యానివర్సరీ టు అస్" అంటూ ప్రేమగా పెట్టిన క్యాప్షన్, ఆ ఫొటోల్లో ఆమె ముఖంలోని ఆనందం అభిమానుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఈ క్యూట్ కపుల్ బాండింగ్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ విశేషాలు చూద్దాం..
వెనిస్ వీధుల్లో లవ్ బర్డ్స్ హంగామా:
ఈసారి తమ పెళ్లి రోజును మరింత స్పెషల్‌గా మార్చుకోవడానికి ఈ జంట ఇటలీలోని అందమైన వెనిస్ నగరానికి వెళ్ళింది. కేవలం ఇద్దరే కాదు, తమ ముద్దుల పిల్లలు ఉయిర్, ఉలగ్‌లను కూడా వెంట తీసుకెళ్లారు. ఇక వెనిస్ నగర వీధుల్లో భర్త, పిల్లలతో కలిసి నయనతార సరదాగా విహరిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ పిక్స్ చూస్తేనే తెలిసిపోతుంది.
నయన్ లుక్ అదిరింది.. వాచ్ ధర షాకింగ్:
ఈ యానివర్సరీ ఫొటోల్లో నయనతార స్టైలిష్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ట్రిప్‌లో నయనతార లైట్-వాష్ డెనిమ్ రోంపర్ ధరించి చాలా కూల్‌గా కనిపించింది. ఇక దానికి మ్యాచింగ్‌గా నడుముకు స్టైలిష్ టై, క్లాసిక్ వైట్ చంకీ స్నీకర్స్, రెడ్ క్రాస్‌బాడీ బ్యాగ్ మరియు డార్క్ సన్‌గ్లాసెస్ జతచేసి మెరిసిపోయింది. అలాగే ఆమె భర్త విఘ్నేష్ సింపుల్ అండ్ స్టైలిష్ మోనోక్రోమ్ స్ట్రీట్ స్టైల్‌లో అలరించారు. ఆయన వైట్ టీ-షర్ట్‌పై నార్మల్ ఓవర్‌షర్ట్ వేసుకుని, లూజ్ చార్కోల్ కార్గో ట్రౌజర్స్ మరియు బ్లాక్ స్నీకర్స్ ధరించారు.
చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ:
పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ నయనతార క్రేజ్ అస్సలు తగ్గలేదు. ప్రస్తుతం ఆమె కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. చేతినిండా భారీ ప్రాజెక్టులతో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారారు. ఇక కన్నడ స్టార్ యష్ సరసన నటిస్తున్న 'టాక్సిక్'తో పాటు పేట్రియాట్, డియర్ స్టూడెంట్స్, మూకుత్తి అమ్మన్ 2, హై, మరియు మన్నంగట్టి వంటి క్రేజీ సినిమాలు ప్రస్తుతం ఆమె లైనప్‌లో ఉన్నాయి.
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీ లైఫ్‌ను సరిగ్గా బ్యాలెన్స్ చేయడంలో నయనతార తర్వాతే ఎవరైనా. విఘ్నేష్ శివన్‌తో ఆమె లవ్ స్టోరీ ఎంత బ్యూటిఫుల్లో, వారి పెళ్లి బంధం కూడా అంతే స్ట్రాంగ్‌గా సాగుతోంది. ఈ స్టార్ కపుల్ ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ, మరిన్ని వెడ్డింగ్ యానివర్సరీలు జరుపుకోవాలని మనమూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు చెబుదాం.