సమ్మర్ వెకేషన్ లో ఫ్యామిలీతో చిల్.. క్యూట్ ఫొటోస్ వైరల్!
ఈ క్రమంలోనే తాజాగా తన సినిమా షూటింగ్ ల నుండి కాస్త బ్రేక్ తీసుకున్న ఈమె.. తన ఫ్యామిలీతో కలిసి వాటికన్ సిటీకి వెకేషన్ కి వెళ్ళింది.
పెళ్లికాకముందు సింగిల్ గా విదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేసే ఎంతోమంది సెలబ్రిటీలు.. వివాహం తర్వాత కూడా అంతే ఎంజాయ్ చేస్తూ మరింత ఆనందాన్ని పొందుతున్నారు.
ముఖ్యంగా తమ భాగస్వాములతో ఏ విధంగా అయితే విదేశాలకు వెళ్లి చిల్ అవుతున్నారో..ఇటు ఫ్యామిలీతో కూడా అదే విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పవచ్చు. అలా ముఖ్యంగా ఫ్యామిలీకి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. కాస్త సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి విదేశీ వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా చేరిపోయారు.
తన సినిమా షూటింగ్ ల నుండి కాస్త బ్రేక్ దొరికితే చాలు తన భర్త , ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో కలిసి వెకేషన్ కి వెళ్లి చిల్ అవుతోంది. ముఖ్యంగా తన ఇద్దరు కొడుకులు, భర్తతో కలిసి నయనతార చేస్తున్న ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు అంటూ ఆ ఫోటోలను చూసిన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ మరింత బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా తన సినిమా షూటింగ్ ల నుండి కాస్త బ్రేక్ తీసుకున్న ఈమె.. తన ఫ్యామిలీతో కలిసి వాటికన్ సిటీకి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడి వీధుల్లో విహరిస్తూ తన ఫ్యామిలీతో కలిసి తీసుకున్న క్యూట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. పైగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ" యూఎస్ లో నాకు ఇష్టమైన ప్లేస్ వాటికన్ సిటీ" అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. మొత్తానికి అయితే నయనతార ఈ సమ్మర్ వెకేషన్ లో భాగంగా తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.
నయనతార సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పైగా ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలబడడమే కాకుండా ఈమె ఖాతాలో మంచి విజయాన్ని చేర్చింది. ఇక మరొకవైపు కన్నడలో లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ప్రముఖ కన్నడ హీరో యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమాలో హీరోకి సోదరి పాత్రలో నటిస్తోంది.
అలాగే నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో నటించిన ఒక మలయాళ వెబ్ సిరీస్ అయినా ప్రియ విద్యార్థులారా లో కీలక పాత్ర పోషిస్తుంది . ఇక అలాగే హై యాక్టేన్ యాక్షన్ డ్రామా రక్కయీ, మూకుత్తి అమ్మన్ 2, తని ఒరువన్ 2 చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలలో భాగమయ్యింది.అంతేకాదు మమ్ముట్టి , మోహన్ లాల్ కాంబినేషన్లో వచ్చిన పేట్రియాట్, తమిళ్ డ్రామా మూవీ మన్నంగట్టి వంటి చిత్రాలలో కీలక పాత్ర పోషిస్తుంది నయనతార.