హీరోయిన్ లో వంశీ హీరోనే చూపిస్తున్నాడు!

ఒక‌ప్పుడు కమర్షియల్ సినిమాలలో హీరోయిన్ పాత్రల పరిధి చాలా పరిమితంగా ఉండేది. గ్లామర్ సీన్లు, రెండు డ్యూయెట్లతో రొటీన్ ఫార్ములాగా సాగేది.

Update: 2026-05-28 03:30 GMT

ఒక‌ప్పుడు కమర్షియల్ సినిమాలలో హీరోయిన్ పాత్రల పరిధి చాలా పరిమితంగా ఉండేది. గ్లామర్ సీన్లు, రెండు డ్యూయెట్లతో రొటీన్ ఫార్ములాగా సాగేది. కానీ ఇప్పుడా ట్రెండ్ మారింది. హీరోల‌కు ధీటుగా హీరోయిన్ పాత్ర‌ల‌ను కొంత మంది ద‌ర్శ‌కులు డిజైన్ చేసి వ‌దులుతున్నారు. తాజాగా స‌ల్మార్ ఖాన్ క‌థానాయ‌కుడిగా వంశీ పైడిపల్లి ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా న‌టిస్తోంది. న‌య‌న్ పాత్ర ఇందులో పక్కా హీరో మార్క్ యాక్షన్ రోల్ లో క‌నిపిస్తుంద‌నే వార్త వెలుగులోకి వ‌చ్చింది.

`బృందావనం`, `మహర్షి`, `వారసుడు` వంటి క్లాస్, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాలతోనే వంశీ మెప్పించారు. కానీ చిత్రాల్లో హీరోయిన్ల పాత్ర‌లు చాలా ప‌రిమితంగానే ఉంటాయి. అలాంటి దర్శకుడు ఈసారి రూట్ మార్చి ఓ భారీ ప్యాన్-ఇండియా యాక్షన్ డ్రామాను సిద్ధం చేయ‌డం ఓ ఎత్తు అయితే? అందులో హీరోయిన్ పాత్రకు మాస్ ఎలివేషన్లు ఇవ్వడం మ‌రో ఎత్తు. కథలో సపోర్టింగ్ క్యారెక్టర్‌లా కాకుండా? కథను మలుపు తిప్పే పవర్ హౌస్‌లా నయనతారను ఆవిష్కరిస్తున్నారు. ఈ విధమైన హీరో మార్క్ మేనరిజమ్స్ - యాక్షన్ బ్లాక్స్ స్టార్ డైరెక్టర్ ఆలోచనా విధానంలో ఆప‌క్తిక‌ర మార్పుగా చెప్పొచ్చు.

బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్ .. మాస్ ఇమేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అలాంటి అగ్ర హీరో పక్కన నటిస్తున్నప్పుడు ఏ హీరోయిన్ అయినా? వెనకబడే ప్రమాదం ఉంటుంది. అయితే నయనతారకు ఉన్న లేడీ సూపర్ స్టార్ అనే బ్రాండ్ ఇమేజ్ దీనికి పూర్తి మినహాయింపు. గతంలో షారూఖ్ ఖాన్ `జవాన్` చిత్రంలోనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా గన్‌ పట్టి యాక్షన్ సీన్స్ చేసిన నయనతార ఇప్పుడు సల్మాన్ ఖాన్‌కు ధీటుగా ఆయనతో సమానంగా తలపడటం ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయం. ఈ రకమైన మార్పు నటీనటుల ఇమేజ్‌కే పరిమితం కాకుండా తెర వెనుక టెక్నీషియన్ల పనితీరును కూడా ప్రభావితం చేస్తోంది.

స్టంట్ మాస్టర్లు ఇప్పుడు మహిళా నటీమణుల కోసం రోప్ షాట్లు , సింప్లిఫైడ్ ఫైట్స్ కాకుండా హాలీవుడ్ రేంజ్ స్టైలిష్, రా యాక్షన్ ఎపిసోడ్స్‌ను డిజైన్ చేస్తున్నారు. మాస్ హీరో గాల్లోకి లేచి విలన్లను తంతే థియేటర్లలో ఎలాంటి విజిల్స్ పడతాయో? అంతే పవర్‌ఫుల్‌గా హీరోయిన్ కూడా బాడీ లాంగ్వేజ్‌ను మెయింటెన్ చేస్తూ ఫైట్స్ చేసేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇది సాంకేతిక పరంగా కమర్షియల్ సినిమా స్థాయిని పెంచుతోంది. ప్రస్తుత తరుణంలో పాన్-ఇండియా ప్రేక్షకులు హీరోల వన్-మ్యాన్ షోలను మాత్రమే చూడటానికి ఇష్టపడటం లేదు.

కథలో బలమైన సంఘర్షణ ..హీరోకి సమానమైన పవర్‌ఫుల్ పాత్రలు ఉన్నప్పుడే సినిమా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తోంది. హీరోయిన్ పాత్రలలో హీరో మార్క్ యాక్షన్ ఎలివేషన్లు ఉండటంతో సినిమా మైలేజ్ డబుల్ అవుతుంది. ఇది అటు నార్త్.. ఇటు సౌత్ ప్రేక్షకులను ఏకకాలంలో థియేటర్లకు రప్పించ డానికి..వందల కోట్ల వసూళ్లను సాధించడానికి అద్భుతమైన కమర్షియల్ వ్యూహంగానూ చెప్పొచ్చు.

Tags:    

Similar News