నయనతార అభిమానించే తార!
నయనతార నేడు లేడీ సూపర్ స్టార్ గా నీరాజనాలు అందుకుంటుంది. దక్షిణాదిన ఎంతో ఫేమస్ అయిన నటి. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో తనకం టూ ప్రత్యేకమైన అభిమానులున్నారు.;
నయనతార నేడు లేడీ సూపర్ స్టార్ గా నీరాజనాలు అందుకుంటుంది. దక్షిణాదిన ఎంతో ఫేమస్ అయిన నటి. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో తనకం టూ ప్రత్యేకమైన అభిమానులున్నారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయింది. చిన్న సినిమాతో కెరీర్ మొదలు పెట్టి అంచ లంచెలుగా ఎదిగింది. ఇప్పటికే సౌత్ పరిశ్రమలో దాదాపు హీరోలందరితోనూ కలిసి పని చేసింది. సౌత్ పరంగా సోలో నాయికగా సత్తా చాటడం ఒక్కటే మిగిలి ఉంది. కొంత కాలంగా ఆ తరహా ప్రయత్నాలు చేస్తుంది గానీ ఫలించడం లేదు.
జీవితంలో ఎన్నో చూసిన నటి:
తాను అనుకున్న విధంగా ఫలితాలు రావడం లేదు. అలాగని ప్రయత్నాలు ఆపలేదు. ఇన్నోవేటివ్ కథలు దొరికితే లాక్ చేసి పెడుతుంది. వాటిని తీయాల్సిన సమయం వచ్చినప్పుడు బయటకు తెస్తుంది. అలాగే నయన్ కెరీర్ పీక్స్ లో ఉండగానే వ్యక్తి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుందో కూడా తెలిసిందే. ప్రేమ..పెళ్లి విషయంలో నయన్ చాలా విస్పోటనాలే చూసింది. వాటన్నింటిని ఎంతో ధైర్యంగా తట్టుకుని నిలబడింది. నేడు వృత్తి..వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా ఉంది. దర్శకుడు విగ్నేష్ శివన్ వివాహం చేసుకుని ఆనందంగా గడుపుతోంది.
ఇద్దరిదీ ఒకే ఊరు:
మరి అలాటి నయనతార అభిమానించే హీరోయిన్ ఎవరో తెలుసా? ఇంత వరకూ ఈ విషయంపై నయన్ ఏనాడు ఓపెన్ అవ్వలేదు. తాజాగా ఆ విషయం బయట పడింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు. మాలీవుడ్ కి చెందిన మీరాజాస్మిన్. మరి జాస్మిన్ కి నయన్ ఎలా అభిమాని అయిందంటే? ఇద్దరిది కేరళ దగ్గర ఉన్న తిరువళ్ల. నయన్ తో పాటు మీరా జాస్మిన్ కజిన్ కూడా కలిసి చదువుకునేదట. ఆ కజిన్ ఎప్పుడూ మీరా జాస్మిన్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిందని...రకరకాల ప్రదేశాలు తిరుగుతుందని ఎంతో గొప్పగా చెప్పేదట.
మీరాజాస్మిన్ తో ఇదే మొదటిసారి:
అవన్నీ నయనతార విని మీరా జాస్మిన్ కు తెలియకుండానే తాను అభిమానిగా మారినట్లు నయన్ తెలిపింది. అప్పుడే తనకి కూడా సినిమాల్లోకి వెళ్లాలి అనే ఆశ కలిగినట్లు గుర్తు చేసుకుంది. కానీ పరిశ్రమకు వచ్చిన తర్వాతన మీరా జాస్మిన్ తో కలిసి నటించడం ఇప్పటి వరకూ సాధ్యపడలేదంది. తాజా సినిమా `టెస్ట్` ద్వారా అది జరిగిందని నయన్ సంతోష పడింది. మీరా జాస్మిన్ తో మాట్లాడటం కూడా ఇదే మొదటి సారి అని నయనతార గుర్తు చేసుకుంది. నయనతార అభిమానులు చాలా మంది ఏ బాలీవుడ్ హీరోయిన్ పేరో చెబుతుందని అనుకున్నారు. కానీ అందిరికీ షాక్ ఇస్తూ తన సొంత ఊరి నటి స్పూర్తితోనే సినిమాల్లోకి వచ్చినట్లు తెలపడం విశేషం.