నయన్ 'అమ్మన్'లో ఈమె లేడీ విలన్..!
అందుకే ఈ సినిమాతో ఆయన కచ్చితంగా ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తాడు అనే విశ్వాసంను నయనతార పెట్టుకున్నట్లుగా తమిళ సినీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా 2020లో వచ్చిన తమిళ ఫాంటసీ కామెడీ మూవీ 'మూకుతి అమ్మన్'. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన మూకుతి అమ్మన్ సినిమాను తెలుగులో అమ్మోరు తల్లిగా ఓటీటీలో ప్రేక్షకులు చూశారు. తమిళ్‌తో పాటు అన్ని భాషల్లోనూ నయనతారను మూకుతి అమ్మన్‌గా ప్రేక్షకులు ఆధరించారు. అందుకే ఇప్పుడు సినిమాకు సీక్వెల్ తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. మొదటి పార్ట్‌కి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా సెకండ్ పార్ట్‌కి ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో హర్రర్ సినిమాలకు సుందర్ సి కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా మారిన విషయం తెల్సిందే. అందుకే ఈ సినిమాతో ఆయన కచ్చితంగా ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తాడు అనే విశ్వాసంను నయనతార పెట్టుకున్నట్లుగా తమిళ సినీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
మూకుతి అమ్మన్ 2 సినిమా...
మూకుతి అమ్మన్ 2 సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్ వేగంగా సాగుతున్నట్లుగా తమిళ మీడియా వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు సుందర్ సి షూటింగ్ పూర్తి చేశామని పేర్కొన్నాడు. ఇక మూకుతి అమ్మన్ 2 సినిమా కోసం ప్రముఖ నటీనటులను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలోని కీలకమైన లేడీ విలన్ పాత్రకు గాను రెజీనా కాసాండ్రాను ఎంపిక చేశారట. ఈ మధ్య కాలంలో ఈమె సినిమాలు పెద్దగా రావడం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన రెజీనా ఆఫర్ల కోసం వెతుక్కునే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో మూకుతి అమ్మన్ 2 లో లేడీ విలన్ ఆఫర్ అనుకోని ఆఫర్ అన్నట్లుగా ఈ అమ్మడి తలుపు తట్టింది. మరి ఈ అమ్మడు ఈ ఆఫర్ ను ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటుంది అనేది చూడాలి.
సుందర్ సి దర్శకత్వంలో...
దర్శకుడు సుందర్ సి ప్రత్యేక శ్రద్ద కనబర్చి మరీ మూకుతి అమ్మన్ 2 సినిమా గ్రాఫిక్స్ వర్క్ చేయిస్తున్నాడట. ముఖ్యంగా నయనతార పాత్ర విషయంలో ఆయన చాలా శ్రద్ద కనబర్చుతున్నాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అలాగే విలన్ పాత్ర కోసం ఎవరో ఒకరు అనుకోకుండా హీరోయిన్‌గా ఇంతకు ముందు మంచి గుర్తింపు దక్కించుకుని ఇప్పటికీ సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్న రెజీనాను ఎంపిక చేయడం ద్వారా ఆయన ఈ సినిమాను ఏ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. నయనతార ఈ సినిమా కోసం బల్క్ డేట్లు ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. కరోనా సమయంలో సంచలనం సృష్టించిన అమ్మన్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన నయన్ మరోసారి అందరి అంచనాలు అందుకునే విధంగా అమ్మన్‌గా కనిపించబోతుంది.
లేడీ సూపర్ స్టార్ హీరోయిన్‌గా...
తమిళ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం దర్శకుడు దాదాపుగా రూ.150 కోట్లను ఖర్చే చేశాడని తెలుస్తోంది. గత ఏడాది షూటింగ్ పూర్తి చేసిన ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో ఆలస్యం అవుతోంది. ఏడాది పాటు వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేయడం పట్ల నయన్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుందర్ సి కి దర్శకత్వ బాధ్యతలను అప్పగించడంను సైతం కొందరు తప్పుబడుతున్నారు. క్రేజీ మూవీని ఇప్పటికే విడుదల చేసి ఉంటే తప్పకుండా మంచి ఫలితం ఉండేది అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఏడాది చివరి వరకు అయినా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనేది చూడాలి. అయితే మూకుతి అమ్మన్ 2 సినిమా విషయమై దర్శకుడు ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. పైగా నయనతార సైతం ఈ సినిమా విడుదల విషయమై స్పందించడం లేదు.