'రాకా' కోసం దీపిక‌ లాభాల్లో వాటా అడ‌గ‌లేదా?

తెలుగు చిత్రసీమలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న `స్పిరిట్` చిత్రం నుంచి దీపికా పదుకోణ్ ని త‌ప్పించ‌డంపై నిరంత‌ర‌ చర్చ నడుస్తున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2026-08-21 03:48 GMT

తెలుగు చిత్రసీమలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న `స్పిరిట్` చిత్రం నుంచి దీపికా పదుకోణ్ ని త‌ప్పించ‌డంపై నిరంత‌ర‌ చర్చ నడుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ టాపిక్ కి ముగింపు అన్న‌దే క‌నిపించ‌డం లేదు. ప్రారంభంలో ఎనిమిది గంటల పనిదినాల నిబంధన వల్లే అగ్ర న‌టి దీపిక‌ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారని వార్తలు వచ్చినా అసలు కారణం వేరే ఉందంటూ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఓ ఇంట‌ర్వ్య‌లో సంచలన విషయాలు వెల్లడించారు. ఇటీవల వరుస విజయాలు సాధించిన నేపథ్యంలో దీపికా ఈ సినిమా నికర లాభాల్లో ఏకంగా 10 శాతం వాటా డిమాండ్ చేశారని.. అక్కడే ఇరువర్గాల మధ్య తీవ్ర విభేదాలు మొదలయ్యాయని ఆయన స్పష్టం చేశారు.

ఈ వివాదంపై ప్రణయ్ రెడ్డి వంగా మరింత మాట్లాడుతూ.. దాదాపు ఏడాది పాటు దీపికాను నమ్మి సినిమాకు సంబంధించిన చాలా సీక్రెట్లు, కథాంశాన్ని షేర్ చేసామ‌ని తెలిపారు. అయితే ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కీలక వివరాలు లీక్ కావడం తమను తీవ్రంగా కలచివేసిందని.. అందుకే ఆమెను తొలగించే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. నిజానికి `స్పిరిట్`తో పాటు భారీ బడ్జెట్ చిత్రం `కల్కి 2898 ఏడీ` సీక్వెల్‌లోనూ దీపిక‌ అవకాశాలను కోల్పోవాల్సి వచ్చిందనే వార్త నెట్టింట వైర‌లైన సంగ‌తి తెలిసిందే.

`స్పిరిట్` నుంచి వైదొలిగిన అనంతరం దీపికా పదుకోణ్ `రాకా` అనే మ‌రో టాలీవుడ్ ప్రాజెక్ట్‌పై సంతకం చేశారు. అయితే ఇక్కడే సినీ ప్రియులు, నెటిజన్లలో ర‌క‌ర‌కాల‌ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారీ ప్రాజెక్టులలో న‌టిస్తే 10 శాతం లాభాల వాటాతో పాటు కఠినమైన పనివేళల నిబంధనలను విధించిన దీపికా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న న‌టించే `రాకా` కోసం ఇలాంటి కండిష‌న్లు పెట్ట‌లేదా? రాకా నిర్మాతలను కూడా ఇలాగే 10 శాతం వాటా డిమాండ్ చేశారా? లేక హాలీవుడ్ రేంజులో రూపొందుతున్న ఈ మూవీ అవకాశం కోసం తన వ్యక్తిగత నిబంధనలు.. లాభాల్లో వాటాల విషయంలో రాజీ పడ్డారా? అనే కోణంలో చర్చలు సాగుతున్నాయి.

అయితే `రాకా` ప్రాజెక్ట్ కోసం దీపికా తన పట్టును పక్కనబెట్టి సాధారణ పారితోషికానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. భారతదేశంలో వరుస సక్సెస్‌లు సాధించిన వేళ చూపించిన డిమాండ్లు అన్ని వేళ‌లా వర్కవుట్ కావు కాబట్టి.. అక్కడ తన ప్రతిపాదనలను పక్కనబెట్టి రాజీకొచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏది ఏమైనా తిరుగులేని క్రేజ్ ఉన్న `స్పిరిట్` వంటి పాన్-ఇండియా అవ‌కాశాన్ని వదులుకుని దీపిక దుస్సాహ‌స‌మే చేసింద‌ని విశ్లేషిస్తున్నారు. స్పిరిట్, రాకా సినిమాలు విడుదలయ్యాక బాక్సాఫీస్ వద్ద వచ్చే ఫలితాలు, వసూళ్ల ఆధారంగానే దీపిక‌ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదా కాదా అనేది తేల్తుంది. ప్రస్తుతం దీపిక రాకాపై దృష్టి సారించి ముందుకు సాగుతుండగా సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రాఫిట్ షేరింగ్ రచ్చ హాట్ టాపిక్‌గానే కొనసాగుతోంది.

Tags:    

Similar News