• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందుకే విఘ్నేష్‌ ఫోటోలు...

అందుకే విఘ్నేష్‌ ఫోటోలు షేర్‌ చేయను : నయన్‌

| సోషల్‌ మీడియాలో గతంలో విఘ్నేష్‌తో కలిసి దిగిన ఫోటోలను ఎక్కువగా షేర్‌ చేసిన నయనతార ఈమధ్య కాలంలో భర్తతో కలిసి దిగిన ఫోటోలను అస్సలు షేర్ చేయడం లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

By - Tupaki Desk
Update: 2024-12-13 23:30 GMT

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార గత కొన్ని రోజులుగా ధనుష్‌తో వివాదం కారణంగా వార్తల్లో ఉంటున్న విషయం తెల్సిందే. డైరెక్ట్‌గా ధనుష్‌ను ఆమె తీవ్ర పదజాలంతో విమర్శించారు. మరో వైపు తన అనుమతి లేకుండా నయనతార డాక్యుమెంటరీలో తన సినిమా విజువల్స్‌ను వినియోగించారు అంటూ ధనుష్ కోర్టును ఆశ్రయించారు. కాపీ రైట్‌ యాక్ట్‌ కింద ఏకంగా రూ.10 కోట్లకు దావా వేసిన ధనుష్‌పై నయనతార దంపతులు రెగ్యులర్‌గా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నయనతార ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ మధ్య కాలంలో విఘ్నేష్‌ శివన్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేయడం లేదు. అందుకు కారణం ఏంటి అంటూ రిపోర్టర్‌ అడిగిన సమయంలో నయన్‌ స్పందిస్తూ... ఈ మధ్య తాను విఘ్నేష్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేస్తే కొందరు నెటిజన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. వాటికి ఎక్కువగా నెగటివ్‌ కామెంట్స్ వస్తున్న కారణంగానే తాను విఘ్నేష్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేయడం లేదని నయనతార చెప్పుకొచ్చింది. సోషల్‌ మీడియాలో గతంలో విఘ్నేష్‌తో కలిసి దిగిన ఫోటోలను ఎక్కువగా షేర్‌ చేసిన నయనతార ఈమధ్య కాలంలో భర్తతో కలిసి దిగిన ఫోటోలను అస్సలు షేర్ చేయడం లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇక తన ప్రతి సినిమా విజయాన్ని సొంతం చేసుకోవడం పట్ల నయనతార సంతోషం వ్యక్తం చేసింది. ఆమె ఈ విషయమై మాట్లాడుతూ తనను అందరు హీరోల అభిమానులు అభిమానిస్తారు. అందరి అభిమానం వల్లే తన సినిమాలు విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ప్రతి సినిమా విజయాన్ని సొంతం చేసుకోవడంలో అభిమానుల ప్రోత్సాహం ఉందని నయనతార చెప్పుకొచ్చింది. నయనతారను ప్రతి ఒక్కరు అభిమానిస్తారు, అందుకే ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.

లేడీ సూపర్‌ స్టార్‌గా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్న నయనతార తల్లి అయిన తర్వాత సైతం సినిమాల విషయంలో తగ్గడం లేదు. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే కాకుండా హీరోయిన్‌గా మంచి కమర్షియల్‌ సినిమాలను సైతం చేస్తోంది. తెలుగులో ఈమె ఒక స్టార్‌ హీరో సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిందీ నుంచి జవాన్‌ తర్వాత ఈమెకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఈమె మాత్రం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది.

Tags:    
  • Nayanthara 
  • Ladysuperstar 
  • Vigneshshivan 
  • Socialmediaphotos 
  • Movies 
  • Ladyorientedmovies 

Similar News

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

కమల్ హాసన్ మల్టీ టాస్కింగ్ జర్నీ!

2026-11-10 12:30 GMT

శ్రీదేవి కూతురుపై ఎన్నో ఆశలు.. చివరికి ఎందుకిలా జరిగింది?

2026-11-10 11:30 GMT

రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ క్లారిటీ అప్పుడేనా?

2026-11-10 10:30 GMT

పవన్ కళ్యాణ్‌కు అండగా టీడీపీ, వైసీపీ..!

2026-11-10 10:24 GMT

పవన్ కళ్యాణ్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చిన జనసేన!

2026-11-10 09:55 GMT

బిజినెస్ ఉమెన్ గా తొలి దీపావళి.. తమన్నా అవుట్ ఫిట్ ఖరీదు ఎంత అంటే

2026-11-10 09:39 GMT

Copyright @2026

Powered by Blink CMS