బిగ్ బాస్ హోస్ట్ గా నయనతారకు ఆఫర్!
ఇప్పటివరకూ బాలీవుడ్ బిగ్ బాస్ ని లేడీ బాస్ రూల్ చేసింది రెండు సీజన్లు మాత్రమే.;
లేడీ సూపర్ స్టార్ నయనతారకు బిగ్ బాస్ హోస్ట్ ఆఫర్ వరించిందా? ఏకంగా బాలీవుడ్ బిగ్ బాస్ హోస్టింగ్ బాధ్యతలే ఇవ్వాలనుకుంటున్నారా? అంటే అవుననే ప్రచారం తెరపైకి వస్తోంది. ఇప్పటివరకూ బాలీవుడ్ బిగ్ బాస్ ని లేడీ బాస్ రూల్ చేసింది రెండు సీజన్లు మాత్రమే. రెండవ సీజన్ ని శిల్పా శెట్టి హోస్ట్ చేయగా, మరో సీజన్ ని పరాఖాన్ హోస్ట్ చేసారు. ఆ తర్వాత మరే నటి హోస్టింగ్ బాధ్యతలు చేపట్టలేదు. అర్దద్ వార్షీ, అమితాబచ్చన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఇలా కొంత మంది స్టార్లు హోస్ట్ చేసారు.
ఇప్పటికే బిగ్ బాస్ లో మేల్ డామినేషనే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీజన్ హోస్టింగ్ బాధ్యతలు నయనతారు కు అప్పగించాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఇటీవలే నిర్వాహకులు ఆమెను కలిసినట్టు తెలిసింది. నయనతార కూడా పాజిటివ్ గానే స్పందించిందట. కానీ చేస్తాను? లేదా? అన్న తుది నిర్ణయం ఇంకా వెల్లడించనట్లు తెలుస్తోంది. తాను ఎస్ చెప్పినా? నో చెప్పినా పాజిటివ్ గా తీసుకోవాల్సిందిగా కోరిందట. దీన్ని బట్టి నయనతార లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.
గతంలో ఇలాంటి అవకాశాలు వస్తే మరో మాట లేకుండా నో చెప్పేది. సినిమా ప్రచారానికి, ప్రకటనలకు చాలా కాలంగా నయనతార దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. ప్రచారం కోసం ప్రత్యేక ప్యాకేజీ ఆఫర్ చేసినా ? నో చెప్పేది. అయితే ఇటీవలి కాలంలో లేడీ సూపర్ స్టార్ కూడా పద్దతి మార్చింది. మెగా స్టార్ చిరంజీవి 157వ సినిమా ప్రారంభానికి ముందే ప్రీ లాంచ్ ప్రచారంలో పాల్గొంది. దీంతో నిబంధనలు సడలించినట్లు నెట్టింట హైలైట్ అయింది.
సొంత బ్యానర్లో సినిమా నిర్మాణం చేపట్టిన నాటి నుంచి ప్రచారం విలువ తెలుసుకున్న నటిగా హైలైట్ అయింది. ఈ నేపత్యంలోనే చిరంజీవి సినిమా విషయంలో ప్రచారం పరంగా పాజిటివ్ గా ఉన్నట్లు కనిపించింది. తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులుతోనూ పాజిటివ్ గా మాట్లాడటం ఆసక్తికరం. మరి ఆమె హోస్ట్ చేస్తుందా? లేదా? అన్నది తేలాలంటే ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతం అమ్మడు నటిగా బిజీగా ఉంది.