40లో రూ.20 కోట్లు... ఇది నయనతారకే చెల్లింది!

గత పదేళ్ల కాలంగా నయనతారకు రాజయోగం అన్నట్లుగా టైం నడుస్తుంది అని ఆమె అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు.;

Update: 2025-11-21 06:54 GMT

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార 2003లో 'మనస్సినక్కరే' అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ అమ్మడు ఎక్కువగా తమిళ్‌ సినిమాలు చేసింది. తమిళ్‌లో ఈమె చేసిన అయ్యా, చంద్రముఖి సినిమాలతో ఒక్కసారిగా స్టార్‌డం దక్కించుకుంది. గజిని సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తమిళ్ లో బిజీగా ఉన్న సమయంలోనే తెలుగులో ఈ అమ్మడు లక్ష్మి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నయనతార టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి దాదాపుగా ఇరవై సంవత్సరాలు అవుతుంది. ఇక ఈమె ఇటీవలే 41 ఏళ్ల వయసులో పడింది. సాధారణంగా హీరోయిన్స్ నాలుగు పదుల వయసులో పడితే ఆఫర్లు తగ్గుతాయి, ప్రేక్షకులు ఆసక్తి తగ్గిస్తారు. కానీ ఈమె విషయంలో మాత్రం అలా జరగడం లేదు. నాలుగు పదుల వయసులోనూ ఈమె జోరు ఏమాత్రం తగ్గలేదు.

వరుస సినిమాలతో నయనతార బిజీ బిజీ

గత పదేళ్ల కాలంగా నయనతారకు రాజయోగం అన్నట్లుగా టైం నడుస్తుంది అని ఆమె అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసినా, హీరోలకు జోడీగా హీరోయిన్‌గా సినిమాలు చేసినా కూడా ఈమెకు సక్సెస్‌లు పడుతున్నాయి. ఒకవేళ ఈమె నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆ ప్రభావం లక్కీగా ఈమె పై పడటం లేదు. అందుకే ఇప్పటికీ నయనతార సౌత్‌లో నెం.1 హీరోయిన్‌గా దూసుకు పోతుంది. ఈ మధ్య వస్తున్న హీరోయిన్స్ పదేళ్లు ఉంటే గొప్ప విషయం అన్నట్లుగా ఉంది. ఆ మధ్య వచ్చిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, పూజా హెగ్డే మరికొందరు ఒక్కసారిగా వెలుగు వెలిగి కనిపించకుండా పోయారు. కానీ నయనతార మాత్రం రెండు దశాబ్దాలు దాటినా, ఆమె వయసు నాలుగు పదులు దాటినా ఇప్పటికీ సినిమాలతో బిజీగా ఉంది. సినిమాలు చేయడం అంటే ఏదో అల్లాటప్పా సినిమాలు వరుసగా ఈమె చేయడం లేదు.

రష్మిక, శ్రీలీల పారితోషికం..

నయనతార చేసే ప్రతి సినిమా పెద్ద బడ్జెట్‌ సినిమా, క్రేజీ మూవీ అయ్యి ఉంటుంది. అంతే కాకుండా టాలీవుడ్‌లో ఈమె తీసుకుంటున్న పారితోషికం హాట్‌ టాపిక్‌గా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్స్‌ అంటే రష్మిక, శ్రీలీల మరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్‌ పేర్లు వినిపిస్తాయి. వారు తీసుకుంటున్న పారితోషికంతో పోల్చితే నయనతార దాదాపుగా మూడు నాలుగు రెట్లు అధికంగా పారితోషికం అందుకుంటుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ఆ మధ్య ఒక సీనియర్‌ స్టార్‌ హీరో సినిమాకు గాను నయనతార ఏకంగా రూ.20 కోట్ల పారితోషికం అందుకుంటుంది అంటూ వార్తలు వచ్చాయి. అందులో నిజం ఎంత అనేది క్లారిటీ లేదు. కానీ ఆమె ఆ స్థాయి పారితోషికం అందుకోగల స్టార్‌డం ఉన్న నటి అంటూ మీడియా వారితో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు, ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ పారితోషికం నిజమే కావచ్చు అనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేశారు.

చిరంజీవి, బాలకృష్ణలతో నయనతార సినిమా

బాలీవుడ్‌లో గత పదేళ్లుగా హీరోయిన్స్ పారితోషికం భారీగా పెరిగింది. కానీ సౌత్‌లో ఇప్పటికీ చాలా మంది స్టార్‌ హీరోయిన్స్ రెండు మూడు కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. కానీ సౌత్‌ లో ఒక్క నయనతార మాత్రమే పది కోట్లు అంతకు మించిన పారితోషికం అందుకుంటుంది అంటూ ఒక జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. నయనతారకు ఉన్న క్రేజ్‌, ఆమె ప్రజెన్స్‌ తో సినిమా స్థాయి పెరగడం వల్ల ఫిల్మ్‌ మేకర్స్‌ ఈమెకు ఎంత పారితోషికం అయినా ఇచ్చేందుకు రెడీ అంటున్నారు. ఇతర భాషలతో పోల్చితే తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ ఈమెకు మరింత పారితోషికం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారట.

ప్రస్తుతం చిరంజీవితో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్‌ గారు సినిమాలో నటిస్తున్న నయనతార, ఇటీవలే బాలకృష్ణ, గోపీచంద్‌ కాంబో మూవీలో హీరోయిన్‌గా ఎంపిక అయింది. ఆ సినిమాలో రాణి పాత్రలో నయనతార కనిపించబోతుందని అధికారికంగా ప్రకటన వచ్చింది. బాలయ్య సినిమాకు నయనతార అత్యధిక పారితోషికం అందుకోబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. 40 ఏళ్ల వయసులో ఈ స్థాయి పారితోషికం అందుకోవడం సౌత్‌లోనే కాకుండా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో కేవలం నయనతారకు మాత్రమే చెల్లిందని ఆమె అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News