• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నయన్.. లక్కు మామూలుగా...

నయన్.. లక్కు మామూలుగా లేదు..

| ఆమెకి సాలిడ్ మార్కెట్ ఉండటంతో నయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-11-22 04:04 GMT

సౌత్ లో మరీ ముఖ్యంగా తమిళనాట ఫిమేల్ సెంట్రిక్ కథలతో లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ తో దూసుకుపోతున్న అందాల భామ నయనతార. ఈ అమ్మడు ఈ ఏడాది జవాన్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచయం అయ్యింది. జవాన్ లో యాక్షన్ సీక్వెన్స్ లో నయనతార ఇరగదీసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఫిమేల్ సెంట్రిక్ సినిమాకి నయన సంతకం చేసింది. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అరుణ్ రాజ్ కామరాజ్ దర్శకుడు.

కనా, నెంజుకు నీది చిత్రాలని ఇప్పటి వరకు అరుణ్ రాజ్ తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు. తాజాగా లేబుల్ వెబ్ సిరీస్ ఒటీటీలోకి అడుగుపెట్టారు. ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో మంచి ఆదరణ పొందుతోంది. ఇప్పటికే నయనతార లైన్ అప్ లో మూడు సినిమాల వరకు ఫిమేల్ సెంట్రిక్ కథలు ఉన్నాయి. ఆమెకి సాలిడ్ మార్కెట్ ఉండటంతో నయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

నయనతార, అరుణ్ రాజ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. కంటెంట్ బేస్డ్ గా సాగే మరో ఇంటరెస్టింగ్ రోల్ లో ఈ సినిమాలో నయనతార కనిపించబోతోందని టాక్. జవాన్ సక్సెస్ తర్వాత నయనతారకి బాలీవుడ్ లో కూడా డిమాండ్ పెరిగింది. అక్కడి నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ కి ఒకే చెప్పిందనే మాట వినిపిస్తోంది.

నయనతార తల్లిగా ఓ వైపు తన కవల పిల్లలని పెంచే పని చూసుకుంటూనే మరో వైపు మంచి కథలని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తోంది. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నయనతార ఉంది. స్టార్ హీరో సినిమా అయిన, ఫిమేల్ సెంట్రిక్ కథలకైన ఆమె 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. టాలీవుడ్ నుంచి దర్శక, నిర్మాతలు నయన డేట్స్ కోసం ట్రై చేస్తున్న రెమ్యునరేషన్ చూసి వెనక్కి తగ్గుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆర్ మాధవన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది. అలాగే మనంగట్టి అనే ఫిమేల్ సెంట్రిక్, అన్నపూర్ణి అనే మరో సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.

Tags:    
  • Bollywood 
  • Nayanthara 
  • Jawan 
  • Arunrajakamaraj 

Similar News

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS