ఫ్యామిలీతో చిల్.. ఈ హీరో భార్య, కొడుకును చూశారా?
ఆ ఫోటోలో నవీన్ చంద్ర తన భార్య ఓర్మా మరియు కొడుకుతో కలిసి బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేశారు.;
హీరోగా.. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. తెలుగు, తమిళ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నవీన్ చంద్ర తాజాగా తన ఫ్యామిలీతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం నవీన్ చంద్ర పోస్ట్ చేసిన ఈ ఫోటోలు అభిమానులని ఆకర్షించాయి.. దాదాపు 20 సంవత్సరాలుగా తెలుగు,తమిళ సినిమాల్లో నటుడిగా రాణిస్తున్న నవీన్ చంద్ర.. తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నాడు. అందులో తన భార్య కొడుకుతో కలిసి బీచ్ లో సరదాగా ఆడుకుంటున్నాడు.
ఆ ఫోటోలో నవీన్ చంద్ర తన భార్య ఓర్మా మరియు కొడుకుతో కలిసి బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేశారు. అయితే ఈ ఫోటోలో వీరు ముగ్గురు కూడా చాలా నేచురల్ గా..క్యాజువల్ గా కనిపించారు. నవీన్ చంద్ర, అతని కొడుకు ఇద్దరు కూడా ఆకుపచ్చ టీషర్టు ధరించి ఉండగా..నవీన్ చంద్ర, భార్య ఓర్మా బ్లాక్ కలర్ టాప్ లో ప్యాంటు ధరించింది. వీరు ముగ్గురు బీచ్ లోని ఇసుకలో కోటలు కట్టడం వాటిని చూసి సంతోషపడడం ఈ ఫోటోలలో చూడవచ్చు. అయితే ఈ ఫొటోస్ చూస్తూ ఉంటే మాత్రం సామాన్యులాగే సెలబ్రిటీలు కూడా తమ కుటుంబంతో ఇంతే సంతోషంగా గడుపుతారు అని అనిపిస్తోంది.
నవీన్ చంద్ర షేర్ చేసిన ఈ ఫోటోలకు క్యాప్షన్ గా అతను సముద్రాన్ని ఒక్కొక్క అలను కనుగొనడాన్ని చూడటం.. జీవితాన్ని మళ్లీ కొత్త కళ్ల ద్వారా చూడటం లాంటిది..ప్రతి చిన్న అడుగు.. ప్రతి ఆసక్తికరమైన చూపు.. ప్రతి చిరునవ్వు..నిజంగా ముఖ్యమైన విషయాన్ని నాకు గుర్తు చేస్తోంది. ఇది నాటకీయంగా లేదు.. నిజాయితీగా ఉంది.మీతో కొంచెం హత్తుకునేలా ఉంది. అంటూ రాసుకొచ్చారు.. ప్రస్తుతం ఈ ఫోటోలతో పాటు నవీన్ చంద్ర పెట్టిన క్యాప్షన్ కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. అభిమానులు నవీన్ చంద్ర షేర్ చేసిన ఫోటోలకి హార్ట్ సింబల్ ని కామెంట్లలో పెడుతున్నారు. ఎప్పుడు సినిమాల్లో నటుడిగా కనిపించే ఈయన ఇలా ఫ్యామిలీతో కలిసి కనిపించడం చాలా ఆనందంగా ఉంది అని ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో విలన్ పాత్రల్లో చూసిన నవీన్ చంద్ర ని ఈ పోస్టులో చూస్తే చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. చాలా మంది సెలబ్రిటీలు తమ ఫ్యామిలీతో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్లను తరచూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
నవీన్ చంద్ర కెరియర్ విషయానికి వస్తే..2012లో అందాల రాక్షసి అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఇక అరవింద సమేత మూవీలో తన విలనిజంతో ఆకట్టుకున్న నవీన్ చంద్ర ఆ తర్వాత హీరోగా.. విలన్ గా..ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సినిమాల్లో రాణిస్తున్నారు. నవీన్ చంద్ర చివరిగా రీసెంట్ గా వచ్చిన మాస్ జాతర మూవీలో విలన్ గా కనిపించారు.