తాను నటించిన సినిమాకి తనకే నో టికెట్!
సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మంచి రివ్యూలు కూడా వచ్చాయి. దీంతో ఈ పండగ విన్నర్స్ లిస్ట్ లో శర్వా కూడా చేరిపోయాడు.;
తాను నటించిన సినిమాలో తనకు టికెట్ లేకపోవడం ఏంటి? అని అడిగితే అతడే ఓ వంద మందికి సినిమా టికెట్లు ఇప్పించగలడు. తనకున్న పరపతిని అంతా ఉపయోగిస్తే ఆ మాత్రం టికెట్లు సంపాదించలేరా? ఆ సినిమా నిర్మించిన నిర్మాతను అడిగి...డైరెక్టర్ ని అడిగినా చిటికలో ఇప్పించగలడు. కానీ ఆ ఛాన్స్ తీసుకోకుండా ట్రై చేస్తే ఒక్క టికెట్ కూడా దొరకదని తాజాగా సీనియర్ నరేష్ విషయంలో ప్రూవ్ అయింది. ఈ సంక్రాంతి కానుకగా శర్వానంద్ హీరోగా నటించిన `నారీ నారీ నడుమ మురారీ` అనే సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మంచి రివ్యూలు కూడా వచ్చాయి. దీంతో ఈ పండగ విన్నర్స్ లిస్ట్ లో శర్వా కూడా చేరిపోయాడు. చాలా కాలంగా శర్వానంద్ కి సరైన సక్సెస్ పడని నేపథ్యంలో `నారీ నారీ నడుమ మురారి` తో ఓ విజయం పడటంతో రిలాక్స్ అవుతున్నాడు. తాజాగా నటుడు నరేశ్ విజయ్ కృష్ణ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి అర్దమవుతుంది. గోవాలో షూటింగ్ పూర్తి చేసుకుని నిన్నే సిటీకి వచ్చామని, పవిత్రతో కలిసి నారీ నారీ నడుమ మురారి సినిమా చూడాలని అనుకున్నామన్నారు.
కానీ మల్టీప్లెక్స్ లో వద్దు, సింగిల్ స్క్రీన్ థియేటర్లో చూద్దామనుకున్నారు. కానీ సింగిల్ స్క్రీన్ లో ఎక్కడా ఒక టికెట్ కూడా దొరకలేదన్నారు. తాను నటించిన సినిమాకి తనకే టికెట్లు దొరకని పరిస్థితి తన జీవితంలో ఇదే తొలిసారి ఎదురైందన్నారు. ఇలా టికెట్ దొరకకపోవడం అన్నది చాలా షాకింగ్ గా ఉందన్నారు. నరేష్ మాటలతో సినిమాని ప్రేక్షకులు బాగా అదరిస్తున్నారని మరోసారి తేలింది. నరేష్ అండ్ కో చివరికి ఆర్కే కాంప్లెక్స్‌లో బుక్ చేసుకుని చూసామన్నారు. మల్టీప్లెక్స్ ల్లో పెద్దగా సందడి ఉండదని భావించినా ఈలలు, కేకలతో థియేటర్ దద్దరిల్లిపోయిందన్నారు.
ఈ మధ్య కాలంలో ఇలాంటి స్పందన తానెప్పుడు చూడలేదన్నారు. నరేష్ సినిమాల విషయానికి వస్తే ఆయన లైనప్ లో చాలా సినిమాలున్నాయి. హీరోగా రిటైర్ అయిన తర్వాత స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలతో అలరి స్తున్నారు. అలాగే ప్రయోగాలకు నరేష్ వెనుకాడని నటుడు. ఎలాంటి పాత్రలొచ్చినా కాదనకుండా పనిచేస్తున్నారు. కొంత కాలంగా ఆయన లైఫ్ స్టైల్ కూడా మారిన సంగతి తెలిసిందే. ఫిట్ నెస్ పై మరింత శ్రద్దతో కనిపిస్తున్నారు. జిమ్, డైట్ అంటూ లుక్ లో చాలా మార్పులు తీసుకొచ్చారు.