నాకోసమే సత్య అలా చేశాడు!: నారా రోహిత్

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ల్యాండ్ మార్క్ 20వ మూవీ సుందరకాండ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-08-26 05:33 GMT

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ల్యాండ్ మార్క్ 20వ మూవీ సుందరకాండ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. డెబ్యుటెంట్ డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు.

సినిమాలో నారా రోహిత్.. సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రను పోషిస్తున్నారు. మ్యారేజ్ ఏజ్ దాటినప్పటికీ, ఐదు క్యాలిటీస్ కలిగి ఉన్న పార్ట్నర్ కోసం సెర్చ్ చేయడం, మ్యాచస్ కోసం తిరిగితిరిగి పేరెంట్స్ విసిగిపోవడం వంటి కథాంశంతో సినిమా చిత్రం రానుంది. శ్రీదేవి విజయ్ కుమార్ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తూ.. కీలక పాత్ర పోషిస్తున్నారు.

యంగ్ బ్యూటీ వృత్తి వాఘాని మరో ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ సత్య కూడా సినిమాలో సందడి చేయనున్నారు. అయితే సత్య రోల్ పై ఇప్పుడు నారా రోహిత్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో మాట్లాడారు. హైదరాబాద్ లో రీసెంట్ గా మేకర్స్ ఈవెంట్ ను ఏర్పాటు చేయగా.. నారా రోహిత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను సత్యకు కథ చెప్పానని, మొత్తం విన్నాడని తెలిపారు. ఆ తర్వాత ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చేస్తా అండి అన్నాడని చెప్పారు. కానీ అప్పుడు తాను సినిమా ఏమి ఉపయోగపడదురా, నువ్వు చేస్తే మాత్రం మూవీకి హెల్ప్ అవుతుందని చెప్పినట్లు వెల్లడించారు. వెంటనే మీరలా అంటే తాను యాక్ట్ చేస్తానని మూవీకి ఓకే చెప్పినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సత్యకు థ్యాంక్స్ చెప్పారు. సినిమాలోని సత్య క్యారెక్టర్ ను మీరంతా ఎంజాయ్ చేస్తారని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో సుందరకాండ షూటింగ్ డేస్ ను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. దర్శకుడు వెంకటేశ్‌ కారణంగానే సినిమా ఇంత అద్భుతంగా వచ్చిందని, ఆయన తనతో ఆరేళ్లు ప్రయాణం చేశారని చెప్పుకొచ్చారు.

సినిమా మాత్రం కచ్చితంగా హిట్‌ అవుతుందని నమ్మకం ఉందని, మరికొన్ని గంటల్లో మీ ముందుకు వస్తుందని గుర్తుచేశారు. అయితే సినిమా అంటే తానొక్కడినే కాదని, దాని వెనుక ఎంతో మంది ఉంటారని చెప్పారు. వాళ్ల కష్టం దాగి ఉంటుందని తెలిపారు. థియేటర్‌ కు వెళ్లి సినిమా చూసి నచ్చితేనే సపోర్ట్ చేయండని కోరారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News