నారా ఇంట మొదలైన పెళ్లి సందడి.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కుమారుడైన నారా రోహిత్ రాజకీయ నేపథ్యం మాత్రమే కాదు ఇటు సినీ హీరోగా కూడా పేరు సొంతం చేసుకున్నారు.;

Update: 2025-10-24 10:06 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కుమారుడైన నారా రోహిత్ రాజకీయ నేపథ్యం మాత్రమే కాదు ఇటు సినీ హీరోగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. అంతేకాదండోయ్ నిర్మాతగా కూడా పలు చిత్రాలు నిర్మించారు కూడా. ఒకవైపు హీరోగా మరొకవైపు నిర్మాతగా కొనసాగుతున్న ఈయన తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

చివరిగా ప్రతినిధి 2, భైరవం, సుందరకాండ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్ ఇప్పుడు ఒక ఇంటి వారు కాబోతున్నారు. అక్టోబర్ 30వ తేదీన తన కోస్టార్ శిరీష తో వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో రేవంత్ రెడ్డిని కలిసిన నారా రోహిత్.. తన వివాహానికి కుటుంబ సమేతంగా హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా రోహిత్ కి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త జీవితం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే తుమ్మల నాగేశ్వరరావు, వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డిలను కూడా రోహిత్ తన పెళ్లికి ఆహ్వానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయాలు కాస్త వైరల్ గా మారాలి.

ఇకపోతే గత ఏడాది అక్టోబర్లో శిరీషతో నిశ్చితార్థం చేసుకున్నారు నారా రోహిత్.. కానీ అనూహ్యంగా నారా రోహిత్ తండ్రి మరణించడంతో పెళ్లి తేదీని కాస్త వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు పెద్దల సమక్షంలో అక్టోబర్ 30న వివాహం చేసుకోబోతున్నారు . ఈ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తూ శుభలేఖలు అందిస్తున్నారు నారా రోహిత్.

రోహిత్ వివాహం చేసుకోబోతున్న శిరీష లెల్ల విషయానికి వస్తే.. నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్ గా నటించింది శిరీష లెల్ల. గురజాల మండలం దైదపాలెంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి నాగేశ్వరరావు నలుగురు కుమార్తెలకు నాణ్యమైన విద్యను అందించారు. శిరీష విదేశాలలో ఉన్నత చదువులు చదివి.. కొంతకాలం అక్కడే ఉద్యోగం కూడా చేసింది. ఇక నటనను కొనసాగించడానికి ఉద్యోగాన్ని వదిలేసిన ఈమె.. నారా రోహిత్ పక్కన ప్రతినిధి2 లో హీరోయిన్గా నటించింది. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం కాస్త ఇప్పుడు పెళ్లికి దారితీసింది. ఇకపోతే శిరీష సోదరి ప్రియాంక కూడా చిత్ర పరిశ్రమలో అవకాశాలు అందుకుంటున్న విషయం తెలిసిందే.

శిరీష అక్కా చెల్లెళ్ల విషయానికొస్తే.. వీరిలో శిరీష చిన్నది. పెద్దమ్మాయి శ్రీలక్ష్మి రెంటచింతలలో అంగన్వాడి సూపర్వైజర్ గా పని చేస్తుండగా.. రెండవ అమ్మాయి భవాని వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడింది. మూడవ అమ్మాయి ప్రియాంక హైదరాబాదులో నివసిస్తూ ఉండగా.. ఇప్పుడు శిరీష పెళ్లికి సిద్ధం అవుతోంది.




Tags:    

Similar News