చ‌రిత్ర రాయాల‌న్నా తిర‌గ‌ రాయాల‌న్నా బాల‌య్యే: నారా లోకేష్‌

క‌థానాయ‌కుడిగా 50 సంవ‌త్స‌రాల కెరీర్ జ‌ర్నీ సాగించిన న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌కు యూకే వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో `గోల్డ్` పుర‌స్కారం ద‌క్కిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-08-30 17:00 GMT

క‌థానాయ‌కుడిగా 50 సంవ‌త్స‌రాల కెరీర్ జ‌ర్నీ సాగించిన న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌కు యూకే వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో `గోల్డ్` పుర‌స్కారం ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా శ‌నివారం సాయంత్రం హైద‌రాబాద్ లో జ‌రిగిన‌ స‌న్మాన కార్య‌క్ర‌మంలో ఆయ‌న అల్లుడు నారా లోకేష్ నాయుడు త‌న ముద్దుల మావ‌య్య‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ వేదిక‌పై బాల‌య్య బాబు హార్డ్ వ‌ర్క్, స్టార్ డ‌మ్ గురించి లోకేష్ మాట్లాడారు.

నంద‌మూరి బాల‌కృష్ణ గారు 50 సంవ‌త్స‌రాలు సినీరంగంలో, అదేవిధంగా ఇటీవ‌ల రాజ‌కీయ రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు... ఆయ‌న మాస్ మ‌హారాజాగా రికార్డులు తిర‌గ‌రాసారు. హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు.. మ‌న మాస్ మ‌హారాజాకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు! అని నారా లోకేష్ అన్నారు. ఈ వేదిక‌పై లోకేష్ వ్యాఖ్యానం పాయింట్ల వారీగా...

*తాత‌మ్మ క‌ల సినిమాతో టాలీవుడ్ కి వ‌చ్చి అఖండ 2 వ‌ర‌కూ స్టార్ గా ప్ర‌యాణించి, సినీప‌రిశ్ర‌మ‌లో బాల‌య్య గారు ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నారు.

*అంద‌రికీ వ‌య‌సు పెరుగుతుంది కానీ బాల‌య్య బాబు మాత్రం ఎప్పుడూ యంగ్ స్ట‌ర్ గానే ఉన్నారు. ఆయ‌న గ్లామ‌ర్, ఆరోగ్యం వెన‌క‌ సీక్రెట్ ఏమిటో ఇప్ప‌టికీ తెలుసుకోలేక‌పోతున్నాను. ఆయ‌న‌కు ఉన్న ఎన‌ర్జీ మా త‌రంలో ఎవ‌రికీ లేదు.

*ఇప్ప‌టికి 110 సినిమాలు చేసారు. ఒకే జాన‌ర్ లో కాదు.. మైథాల‌జీ, జాన‌ప‌దం, డివోష‌న‌ల్, బ‌యోపిక్, సైన్స్ ఫిక్ష‌న్ అన్నిటినీ ప్ర‌య‌త్నించారు. ఏ పాత్ర పోషించినా దానికి న్యాయం చేస్తారు. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణిలో మీసం మెలేయ‌డం అఖండ‌లో సింహంలా గ‌ర్జించ‌డం కేవ‌లం బాల‌య్య‌కే సాధ్యం.

*నా పాద యాత్ర‌లో ఆయ‌న డైలాగులు చాలా వాడాను. ఈరోజు ఆయ‌న ముందు ఆ డైలాగులు రావు. బాల‌య్య బాబు నిర్మాత‌, ద‌ర్శ‌కుల‌కు స‌హ‌కారి, ప‌రిశ్ర‌మ గురించే ఆలోచిస్తారు. కోవిడ్ వ‌చ్చినా ఇబ్బందుల్లోను ఆయ‌న ప్రారంభించిన సినిమాని పూర్తి చేసారు.

*బాల‌య్య బాబు గారు ఒక భోళా శంక‌ర్. మ‌న‌సులో ఏది ఉన్నా సూటిగా చెబుతారు. అందుకే ఆయ‌న‌ను సినిమా ఇండ‌స్ట్రీ మొత్తం విడిచి పెట్ట‌దు. ఆయ‌న కెరీర్ లోను ఒడిదుడుకులు ఉన్నాయి. ఫ్లాపులొచ్చినా హిట్టొచ్చినా ఒకేలా ఉన్నారు. యాభై ఏళ్లు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఒకే ఏడాది ఐదు సినిమాలు చేసారు ఆయ‌న‌. చ‌రిత్ర రాయాలన్నా దానిని తిర‌గ‌రాయాల‌న్నా బాల‌య్య బాబుతోనే సాధ్యం.

*బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఇనిస్టిట్యూట్ ద్వారా అనేక సేవ‌లు అందిస్తూ, ప్ర‌జ‌ల‌కు ఏ ఇబ్బంది ఉన్నా అండ‌గా నిలిచారు బాల‌య్య‌. అటు తెలంగాణ , ఆంధ్ర రాష్ట్రానికి క‌ష్టం వ‌స్తే, ఐదేసి ల‌క్ష‌ల చొప్పున‌ సీఎం స‌హాయ‌నిధికి సాయం చేసారు. కోవిడ్ స‌మ‌యంలోను 25ల‌క్ష‌లు ఆర్థిక సాయం ప్ర‌క‌టించడం ఆయ‌న‌లోని య‌హ్యూమ‌నిజం. ఆయ‌న ట్రూలీ అన్ స్టాప‌బుల్. అందుకే వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేరారు. 50 సంవ‌త్స‌రాలు ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించ‌డం తెలుగు జాతికి గ‌ర్వ‌కార‌ణం..

...........అని లోకేష్ త‌న స్పీచ్ ముగించారు.

Tags:    

Similar News