ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న స్టార్ కిడ్.. పూర్తి వివరాలివే!

గత కొద్ది రోజుల నుండి నవోమిక శరన్ ఎక్కువగా మడాక్ ఫిలిమ్స్ ఆఫీస్ బయటే కనిపించడంతో ఈ హీరోయిన్ సినీ ఎంట్రీ గురించి బీ టౌన్ లో చర్చలు జరుగుతున్నాయి.;

Update: 2025-10-17 22:30 GMT

బాలీవుడ్ ఇండస్ట్రీలోకి చాలామంది నెపోకిడ్స్ వస్తూ ఉంటారు. అలా ఇండస్ట్రీలో ఎక్కువ మంది నెపోకిడ్స్ ఉండడం వల్ల కొత్తవారికి ఎక్కువగా అవకాశాలు రావు. అలా తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి మరో నెపోకిడ్ రాబోతోంది. అది కూడా అమితాబ్ బచ్చన్ మనవడితో మొదటి సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ నెపోకిడ్ ఎవరో కాదు డింపుల్ కపాడియా - రాజేష్ ఖన్నాల మనవరాలు నవోమిక సరన్. బాలీవుడ్ లో రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియా జంట అంటే తెలియని వారు ఉండరు. రాజేష్ ఖన్నా నటుడిగా.. నిర్మాతగా.. బాలీవుడ్లో రాణించడమే కాకుండా రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.

రాజేష్ ఖన్నా పెళ్లి చేసుకున్న డింపుల్ కపాడియా కూడా హీరోయినే. రాజేష్ ఖన్నా - డింపుల్ కపాడియాల ఇద్దరు కుమార్తెలలో పెద్ద కుమార్తె ట్వింకిల్ ఖన్నా అక్షయ్ కుమార్ ని పెళ్లి చేసుకుంది. చిన్న కూతురు రింకీ ఖన్నా సమీర్ శరన్ ని పెళ్లి చేసుకుంది. అయితే తాజాగా రింకీ ఖన్నా కూతురు నవోమిక శరన్ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది..

గత కొద్ది రోజుల నుండి నవోమిక శరన్ ఎక్కువగా మడాక్ ఫిలిమ్స్ ఆఫీస్ బయటే కనిపించడంతో ఈ హీరోయిన్ సినీ ఎంట్రీ గురించి బీ టౌన్ లో చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నవోమిక శరన్ అమితాబ్ బచ్చన్ మనవడితో మొదటి సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు నవోమిక మొదటి సినిమాలో అమితాబ్ బచ్చన్ మనవడు కాకుండా మరో హీరో ఎంట్రీ ఇచ్చారు.

విషయంలోకి వెళ్తే.. రింకీ ఖన్నా కూతురు నవోమిక మొదటి మూవీ దినేష్ విజన్ నిర్మాణంలో రాబోతున్నట్టు తెలుస్తోంది. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నవోమిక ని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు సమాచారం.ఇప్పటికే నవోమిక డాన్స్,యాక్టింగ్ వంటి వాటిల్లో శిక్షణ కూడా తీసుకుంటుందట.

ఈమె శిక్షణ పూర్తి అవ్వడంతో.. వచ్చే ఏడాది సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. అయితే నవోమిక మొదటి మూవీలో హీరోగా అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందాను అనుకున్నారట.అంతేకాదు ఈ స్టోరీని కూడా అగస్త్యనందాని దృష్టిలో ఉంచుకొని రాశారట. కానీ డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్ల అగస్త్యనందాని ఆ సినిమా నుండి పక్కనపెట్టి జిగ్రా మూవీలో నటించిన వేదాంగ్ రైనాతో ఈ సినిమా తీయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వేదాంగ్ రైనా తో దినేష్ విజన్ చర్చలు జరిపినట్టు సమాచారం.పైగా వేదాంగ్ రైనా,నవోమికల మధ్య కెమిస్ట్రీ బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తుందట.

ప్రస్తుతం వేదాంగ్ రైనా ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ పూర్తీ కాగానే వేదాంగ్ రైనా నవోమిక శరన్ తో కలిసి కొత్త సినిమా సెట్స్ లో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి హీరో హీరోయిన్ ను ఫిక్స్ చేసినప్పటికీ డైరెక్టర్ గా ఎవరనేది మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. త్వరలోనే డైరెక్టర్ పేరును కూడా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News