టైర్ 2 హీరోలలో టాప్ ఓపెనింగ్స్.. ఈ ఇద్దరిదే హవా!
ముఖ్యంగా టాప్ స్టార్ సినిమాలకు మాత్రమే కాదు, మిడిల్ రేంజ్ లేదా యంగ్ జనరేషన్ హీరోల సినిమాలకు కూడా ఫస్ట్ డే వసూళ్లు భారీగా ఉండడం ఇటీవల కాలంలో సాధారణంగా మారింది.;
తెలుగు సినిమా పరిశ్రమలో ఓపెనింగ్ డే కలెక్షన్లు ఎప్పుడూ హాట్ టాపిక్. ముఖ్యంగా టాప్ స్టార్ సినిమాలకు మాత్రమే కాదు, మిడిల్ రేంజ్ లేదా యంగ్ జనరేషన్ హీరోల సినిమాలకు కూడా ఫస్ట్ డే వసూళ్లు భారీగా ఉండడం ఇటీవల కాలంలో సాధారణంగా మారింది. ముఖ్యంగా నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కేవలం నటనతోనే కాదు, తమ మార్కెట్ సత్తా కూడా చూపిస్తున్నారు. ఈసారి వారి సినిమాల ఓపెనింగ్స్ టాలీవుడ్‌లో ప్రత్యేకంగా నిలిచాయి.
యంగ్ హీరోల మార్కెట్ ఎక్కడికి చేరిందంటే…
టాలీవుడ్‌లో మెయిన్ స్ట్రీమ్ నుంచి నేటితరం యువ హీరోలు వచ్చినప్పటి నుంచి, వీరి సినిమాల ఓపెనింగ్స్ ట్రేడ్ లో కొత్త బెంచ్ మార్క్‌లను ఏర్పరిచాయి. హిట్ 3, దసరా, కింగ్‌డమ్ వంటి సినిమాలు సాధించిన ఫస్ట్ డే వసూళ్లు చూస్తే, యూత్ ఫాలోయింగ్ ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తోంది. గతంలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం పెద్ద హీరోలకు మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రమోషన్స్, సంగీతం, ట్రైలర్ అంచనాలు, సోషల్ మీడియా హవా ఇవన్నీ కలిసి యంగ్ హీరోలకు సూపర్ ఓపెనింగ్స్ తీసుకొస్తున్నాయి.
ఫస్ట్ డే కలెక్షన్స్
ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో విడుదలైన యంగ్ జెన్ హీరోల సినిమాల్లో, నాని నటించిన ‘హిట్ 3’ ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.35 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇది నాని కెరీర్‌లోనే కాదు, నాని బిగ్ సినిమాల క్యాటగిరీలో ఓ రికార్డ్. అలాగే నాని ‘దసరా’ కూడా హాలిడే రిలీజ్‌తో రూ.34 కోట్ల వసూళ్లను అందుకుంది.
లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘కింగ్‌డమ్’ రూ.33 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ మూడు సినిమాలు వరుసగా తక్కువ సమయంలోనే ఇంత భారీ వసూళ్లు రాబట్టడం విశేషం. పెద్ద హీరోల సినిమాల రేంజ్ లోనే ఇవి నిలిచాయి. ఈ భారీ ఓపెనింగ్స్‌కి ప్రధానంగా కారణాలు కొన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్ క్రేజ్‌తో పాటు, రిలీజ్ ముందు నుంచే అంచనాలు పెంచేలా ప్రమోషనల్ ఈవెంట్స్, ట్రైలర్స్, సోషియల్ మీడియా ఇంటరాక్షన్ బాగా పెరిగాయి.
యంగ్ జనరేషన్ నాన్ బిగ్గీస్ తెలుగు సినిమాల వరల్డ్‌వైడ్ డే 1 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్:
HIT3 - 35 కోట్లకు పైగా
దసరా - 34 కోట్లకు పైగా
కింగ్డమ్ - 33 కోట్లు (అంచనా)
యంగ్ హీరోలపై మరోసారి ట్రేడ్ ఫోకస్
ముఖ్యంగా యువత ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలపై ఆసక్తిగా ఉండటం, ఫస్ట్ డే టికెట్ బుకింగ్స్ కు దారితీస్తోంది. ఇటీవల సినిమా ప్రమోషన్లు పెద్ద ఎత్తున మలుపు తిరగడంతో, యంగ్ హీరోల మార్కెట్ పెరగడానికి ఇవి కీలకమైన అంశాలు. ఇకపై టాలీవుడ్‌లో యంగ్ జనరేషన్ హీరోల సినిమాల మీద ట్రేడ్ వర్గాలు ప్రత్యేక దృష్టి పెట్టనున్నాయి. చిన్న హాలిడే అయినా, సరిగ్గా ప్రమోషన్ చేసినా, కంటెంట్ బాగుంటే ఫస్ట్ డే వసూళ్లు స్టార్స్ స్థాయిలో రావొచ్చని హిట్ 3, దసరా, కింగ్‌డమ్ సినిమాలు నిరూపించేశాయి. ఇది బిజినెస్ పరంగా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు కొత్త హోప్స్ ఇచ్చేలా ఉంది.