2026 రెండు సినిమాలు సాధ్యమా నాని..?
న్యాచురల్ స్టార్ నాని సినిమా అంటే అది పక్కా హిట్ అనేలా పరిస్థితి ఉంది. సరైన కంటెంట్ తో సినిమాలు చేస్తూ వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు నాని.;
న్యాచురల్ స్టార్ నాని సినిమా అంటే అది పక్కా హిట్ అనేలా పరిస్థితి ఉంది. సరైన కంటెంట్ తో సినిమాలు చేస్తూ వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు నాని. అందుకే నాని సినిమా అంటే చాలు ఆడియన్స్ లో ఒక రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉంటున్నాయి. నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. దసరా తో తనకు మెమరబుల్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లోనే ఈ సినిమా వస్తుంది. ఐతే ఈ సినిమా 2026 మార్చిలో రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్. అనుకున్న టైం కి సినిమా పక్కా రిలీజ్ చేసేలా చూస్తున్నారట. సినిమాలో నాని డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపిస్తారట. ముఖ్యంగా రీసెంట్ గా జడల్ రోల్ లో నాని టీజర్ ఇంప్రెస్ చేసింది.
నాని సుజిత్ డైరెక్షన్ లో సినిమా..
ఐతే శ్రీకాంత్ ఓదెల తర్వాత నాని సుజిత్ డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నాడు. నాని సుజిత్ కాంబోలో ఒక రోమ్ కోమ్ ఎంటర్టైనర్ సినిమా వస్తుందని టాక్. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తారని తెలుస్తుంది. ఓజీ సినిమా రిలీజ్ హడావిడిలో ఉన్న సుజిత్ ఆ సినిమా రిలీజ్ తర్వాత నాని సినిమా పనుల్లో బిజీ అవనున్నారు. అంతేకాదు సినిమాను అనుకున్న టైం లో.. అనుకున్న షెడ్యూల్ లో పూర్తి చేయాలని ప్లాన్ చేశారట.
నాని సుజిత్ కాంబోలో వస్తున్న సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. అంతేకాదు సినిమాను నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ రిలీజ్ ప్లాన్ చేస్తారట. అంటే నాని నెక్స్ట్ ఇయర్ రెండు సినిమాలతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్నాడు. ది ప్యారడైజ్ తో మరోసారి తన మాస్ అప్పీల్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేయనున్న నాని నెక్స్ట్ సుజిత్ తో ఒక స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాతో వస్తారని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా డిక్లేర్ చేయలేదు.
ది ప్యారడైజ్ ని మార్చి రిలీజ్..
ఏది ఏమైనా నెక్స్ట్ ఇయర్ నాని నుంచి రెండు సినిమాలు వస్తాయని ఫిక్స్ అవ్వొచ్చు. ది ప్యారడైజ్ ని ఎట్టి పరిస్థితుల్లో మార్చి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో సుజిత్ సినిమాకు ఏడాది చాలు. సో ఓజీ తర్వాత సుజిత్ నాని సినిమాతో రావడం ఫిక్స్ అవ్వొచ్చు. నాని సుజిత్ తర్వాత మళ్లీ హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ తో మరో సినిమా చేస్తాడని టాక్. ఆ సినిమా ప్లానింగ్స్ కూడా జరుగుతున్నాయి.