ప్యారడైజ్ గోల్డెన్ విండో.. టాక్ కంటే ముందు కావాల్సింది ఇదే!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

Update: 2026-09-07 18:30 GMT

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదలకు దగ్గరవుతున్న కొద్దీ ఆ హైప్‌ ను మరింత పెంచాల్సిన టైమ్ వచ్చేసింది. అయితే విడుదల తేదీపై కన్ఫ్యూజన్ ఉన్నా ఇప్పుడు మూవీ టీమ్ చేతిలో ఉన్న టైమ్ చాలా విలువైనది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే విడుదలకు ముందే సినిమాపై భారీ డిమాండ్ క్రియేట్ చేయొచ్చు.

ఒక సినిమాపై పాజిటివ్ బజ్‌ ఉండటం వేరు.. దాన్ని థియేటర్లకు వెళ్లాలనే ఆసక్తిగా మార్చడం వేరు. ది ప్యారడైజ్ కు ప్రస్తుతం బజ్ విషయంలో ఢోకా లేదు. ఇప్పుడు రెండో దాన్ని సాధించడమే అసలు టార్గెట్ కావాలి. ప్రేక్షకులు సినిమా గురించి మాట్లాడటమే కాకుండా.. ఇది థియేటర్‌ లోనే చూడాలనే ఫీలింగ్‌ కు రావాలి. అదే ప్రీ రిలీజ్ ప్రమోషన్స్‌ లో కీలకమైన మార్పు. ఇందుకు ప్రతి అప్డేట్ ఒక ప్రత్యేక ఈవెంట్‌లా ఉండాలి.

మూడో పాట వస్తే కేవలం సాంగ్ రిలీజ్ లా కాకుండా సినిమాపై మరో చర్చకు కారణం కావాలి. ట్రైలర్ వస్తే కథను మొత్తం చెప్పేయడం కాకుండా.. ‘ది ప్యారడైజ్ వరల్డ్ ఎలా ఉంటుంది? నాని పాత్రలో ఏదైనా కొత్తదనం ఉందా? శ్రీకాంత్ ఓదెల ఈసారి ఏ రేంజ్ లో ట్రీట్మెంట్ ఇచ్చారు? అనే ప్రశ్నలకు ఆసక్తి పెంచేలా ఉండాలి. ముఖ్యంగా ట్రైలర్ సినిమాకు క్యూరియాసిటీని అమ్మాలి కానీ కథను అమ్మకూడదు.

ప్రేక్షకుడికి సినిమా ఏం చెప్పబోతోందో ఒక అంచనా రావాలి. అదే సమయంలో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్కంఠ మిగలాలి. ఆ బ్యాలెన్స్ కుదిరితే సోషల్ మీడియాలో వచ్చే చర్చే సినిమాకు ఉచిత ప్రమోషన్‌ గా మారుతుంది. ఇక పాన్ ఇండియా విషయంలో కూడా ఇదే స్ట్రాటజీ అవసరం. తెలుగులో నాని మార్కెట్, శ్రీకాంత్ ఓదెల గత సినిమా ఎఫెక్ట్ సినిమాకు బాగా కలిసొచ్చింది.

కానీ ఇతర భాషల్లో ఆడియన్స్‌ను ఆకర్షించాలంటే కేవలం డబ్బింగ్ కంటెంట్ సరిపోదు. సినిమా కాన్సెప్ట్, నాని పాత్ర, విజువల్స్, మ్యూజిక్.. వీటిలో ఏ అంశం వారికి బలంగా కనెక్ట్ అవుతుందో గుర్తించి దానినే ప్రమోషన్స్‌ లో ముందుకు తీసుకెళ్లాలి. అలాగే ఒకేసారి చాలా విషయాలు చెప్పేయడం కంటే.. విడుదల వరకు ఆసక్తిని పెంచడం పెంచడం ముఖ్యం. ఒక అప్డేట్‌ తో హైప్ పెరగాలి. దాని తర్వాత వచ్చే అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూడాలి.

చివరికి ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ సమయానికి సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ పీక్‌ కు చేరాలి. ఎందుకంటే సినిమా టాక్ ఎలా ఉంటుందో విడుదల వరకు ఎవరికీ తెలియదు. కానీ టాక్ వచ్చే ముందు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే వాతావరణాన్ని మాత్రం మూవీ టీమ్ సృష్టించగలదు. ఆ పని చేయడానికి ప్యారడైజ్ కు ఇప్పుడు దొరికిన సమయమే గోల్డెన్ విండో. ప్రస్తుతం సినిమాకు హైప్ ఉంది. ఇప్పుడు దానికి ఫ్రీక్వెన్సీ, క్యూరియాసిటీ, పాన్ ఇండియా రీచ్ యాడ్ అవ్వాలి. హైప్‌ ను డిమాండ్‌ గా, డిమాండ్‌ ను థియేటర్ ఆక్యుపెన్సీగా మార్చేలా ప్రమోషన్స్ సాగితే.. విడుదలకు ముందే ది ప్యారడైజ్ కు కావాల్సిన బజ్ వచ్చేస్తుందనే చెప్పాలి.

Tags:    

Similar News