చేతుల నిండా గోరింటాకు.. ఇంటి మొత్తం పూల అలంకరణ.. ఏంటి సంగతి కావ్య ?

ఆ తర్వాత వేణు ఎల్దండి దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాలో హీరోయిన్ గా నటించి, అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది.. ఈ సినిమాలో ఆమె నటన అందరి చేత ప్రశంసలు కురిపించింది.

Update: 2026-09-07 15:48 GMT

గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్న తేనె కళ్ళ సుందరి కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చబ్బీ చీక్స్.. ముద్దు ముద్దు మాటలతో అందరి దృష్టిని ఆకట్టుకున్న కావ్య కళ్యాణ్ రామ్.. స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బన్నీ, బాలు, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు ఇలా పలు చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2022లో సాయికిరణ్ దర్శకత్వం వహించిన హారర్ చిత్రం ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయింది.



 


ఆ తర్వాత వేణు ఎల్దండి దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాలో హీరోయిన్ గా నటించి, అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది.. ఈ సినిమాలో ఆమె నటన అందరి చేత ప్రశంసలు కురిపించింది. ఇకపోతే ఎం ఎం కీరవాణి తనయుడు శ్రీ సింహా ప్రధాన పాత్రలో వచ్చిన ఉస్తాద్ సినిమాలో నటించిన ఈమె.. అదే సమయంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు కాలభైరవతో ప్రేమలో పడింది. ఇద్దరూ చట్టపట్టాలేసుకొని తిరుగుతూ.. ఎన్నోసార్లు మీడియా కంటపడ్డారు. కానీ ఎక్కడ తమ బంధాన్ని రివీల్ చేయలేదు. కానీ గత వారం రోజుల క్రితం ఎట్టకేలకు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించి, అభిమానులను సర్ప్రైజ్ చేశారు . ముఖ్యంగా కావ్య , ఇటు కాలభైరవ ఇద్దరూ కూడా తామిద్దరం ప్రేమలో ఉన్నామంటూ అధికారికంగా ప్రకటించారు.



 


ఇకపోతే కావ్య అలా తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించేందో లేదో సరిగ్గా వారం రోజుల తర్వాత ఇప్పుడు తాజాగా పంచుకున్న పోస్ట్ సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది. ఇందులో ఆమె లంగా వోణీలో చాలా చక్కగా ఒక ఫోటోలో కనిపించగా.. మరికొన్ని ఫోటోలలో చేతులు, కాళ్లకు గోరింటాకు పెట్టుకుని కాబోయే వధువుల ముస్తాబయింది. మరికొన్ని ఫోటోలలో పూలు కడుతున్నట్టు, ఇంటిని అందంగా ముస్తాబు చేస్తున్నట్టు , తన అమ్మమ్మకు ప్రత్యేకంగా మెహందీ పెడుతున్నట్టు..ఇలా కొన్ని రకాల ఫోటోలను కావ్య పంచుకుంది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.



 


చేతినిండా గోరింటాకు.. ఇంటి మొత్తం పూల అలంకరణ.. కావ్య ఏంటి స్పెషల్ అని కామెంట్ చేస్తుంటే.. మరికొంతమంది నిశ్చితార్థానికి సిద్ధమవుతున్నారా ? అంటూ ఇలా ఎవరికివారు తమ అభిప్రాయాలను వ్యక్తపరిస్తున్నారు. మరొక నెటిజన్ .." కావ్య.. మీ చిన్న మామయ్య ఫోన్ తీసుకొని అందులో వారణాసి మహేష్ బాబు రాముని లుక్ లీక్ చెయ్ అమ్మ" అంటూ కామెంట్ చేశారు. ఇంకొకరు అయితే "అంతా బాగుంది కానీ అరుంధతి రాయ్ బుక్కు చదువుతున్నావు చూడు కతం.. బై బై టాటా" అంటూ ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో షేర్ చేశారు. మొత్తానికి అయితే కావ్య షేర్ చేసిన ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Tags:    

Similar News