ఓదెల ఎంత చెప్పినా అదే జరుగుతుంది..!
తాజాగా ఒక ఆన్ లొకేషన్ స్టిల్ ఒకటి లీక్ అయింది. అందులో మోహన్ బాబు ఫోటోను ఉంచడంతో సినిమాలో ఆయన నటిస్తున్నట్లుగా స్పష్టత వచ్చినట్లయింది.;
'దసరా' సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం 'ది ప్యారడైజ్' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. నానికి మొదటి రూ.100 కోట్ల సినిమాగా దసరా నిలిచిన విషయం తెల్సిందే. శ్రీకాంత్ ఓదెల పై నమ్మకంతో వెంటనే మరో సినిమాను నాని చేసేందుకు కమిట్ అయ్యాడు. నానితో ది ప్యారడైజ్ సినిమాను శ్రీకాంత్ ఓదెల చేస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే దసరా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ది ప్యారడైజ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి నెలలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.
ఈ సినిమాలో మోహన్ బాబు విలన్‌గా నటిస్తున్నట్లు ఆ మధ్య పుకార్లు వచ్చాయి. సినిమాకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు కొందరు లీక్ చేస్తున్నారు. మొదట సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించక ముందే కొందరు లీక్ చేశారు. ఆ సమయంలో శ్రీకాంత్ ఓదెల సుదీర్ఘమైన ప్రెస్ నోట్‌ను విడుదల చేసి తన అసహనం వ్యక్తం చేశాడు. ఇలా లీక్ చేయడం వల్ల సినిమాకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నాడు. ఆయన ఎంత చెప్పినా కూడా లీక్‌లు మాత్రం ఆగడం లేదు. ది ప్యారడైజ్ సినిమాలో విలన్‌గా మోహన్ బాబు నటిస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ఆ విషయమై మేకర్స్ సైలెంట్‌గా ఉన్నారు. తాజాగా ఆ విషయమై స్పష్టత వచ్చింది.
తాజాగా ఒక ఆన్ లొకేషన్ స్టిల్ ఒకటి లీక్ అయింది. అందులో మోహన్ బాబు ఫోటోను ఉంచడంతో సినిమాలో ఆయన నటిస్తున్నట్లుగా స్పష్టత వచ్చినట్లయింది. మోహన్ బాబు నటిస్తున్న విషయాన్ని రహస్యంగా ఉంచాలని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల భావించాడు. కానీ అది సాధ్యం కాలేదు. టైటిల్ విషయంలోనూ ఆయన చాలా ప్లాన్ చేసుకున్నాడు. కానీ అది కూడా లీక్ కావడంతో వెంటనే రివీల్ చేయాల్సి వచ్చింది. ఇలా చాలా విషయాల్లో శ్రీకాంత్ ఓదెల అనుకున్నది కాస్త ముందుగానే లీక్ కావడంతో సినిమాపై బజ్ తగ్గుతోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఈ సినిమా గురించి ఏదో ఒక విషయమై చర్చ జరుగుతున్న నేపథ్యంలో నాని అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
నానితో శ్రీకాంత్ ఓదెల చేస్తున్న 'ది ప్యారడైజ్' సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవితో సినిమాను మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే వీరి కాంబో మూవీని అధికారికంగా ప్రకటించారు. నాని నిర్మించబోతున్న చిరు-ఓదెల మూవీ వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమా వచ్చే ఏడాదిలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చిరంజీవి కోసం ఓదెల రెడీ చేసిన స్టోరీ లైన్‌పై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. చిరంజీవి ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అయ్యే విధంగా సినిమా ఉంటుంది అంటూ మేకర్స్ బలంగా చెబుతున్నారు. ది ప్యారడైజ్ సినిమా హిట్ అయితే చిరంజీవి తో ఆయన తీయబోతున్న సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.