నానితో ఎవరా లక్కీ భామ..?

నెక్స్ట్ ది ప్యారడైజ్ తో రాబోతున్న నాని ఆ సినిమాతో మరోసారి తన మాస్ మేనియా ఏంటో చూపించబోతున్నాడు.;

Update: 2026-01-09 07:30 GMT

న్యాచురల్ స్టార్ నాని సినిమా అంటే పక్కా హిట్ అనేలా ఫాం కొనసాగిస్తున్నాడు. దసరా తర్వాత నాని స్టోరీ సెలక్షన్ పంథా మారింది. ఓ పక్క అద్భుతమైన కథలతో పాటు మాస్ యాక్షన్ సినిమాలను చేస్తున్నాడు. నెక్స్ట్ ది ప్యారడైజ్ తో రాబోతున్న నాని ఆ సినిమాతో మరోసారి తన మాస్ మేనియా ఏంటో చూపించబోతున్నాడు. శ్రీకాంత్ ఓదెలతోనే నాని చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

నాని నెక్స్ట్ సుజీత్ డైరెక్షన్ ..

ది ప్యారడైజ్ తర్వాత నాని నెక్స్ట్ సుజీత్ డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నాడు. ఓజీ తర్వాత సుజీత్ చేస్తున్న సినిమా ఇదే అవ్వడం విశేషం. నానితో చేస్తున్న సినిమాతో కూడా సుజీత్ సంథింగ్ డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. నాని సుజీత్ ఈ కాంబినేషన్ సినిమా ఒక రొమాంటిక్ యాక్షన్ సినిమాగా వస్తుందట. నాని సినిమాలో హీరోయిన్ పాత్రలకు మంచి స్ట్రెంత్ ఉంటుంది. ది ప్యారడైజ్ లో హీరోయిన్ ఎవరన్నది మొన్నటిదాకా సస్పెన్స్ లో ఉంచారు.

ఫైనల్ గా డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్ ఆ లక్కీ ఛాన్స్ అందుకుంది. ఇప్పుడు సుజీత్, నాని కలయికలో వస్తున్న సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఎవరికి దక్కుతుందని డిస్కస్ చేస్తున్నారు. సుజీత్ ఒకసారి చేసిన హీరోయిన్ తో మరోసారి చేయలేదు. నాని కూడా హీరోయిన్స్ ని రిపీట్ చేయడానికి ఇష్టపడడు. కానీ అతనితో గ్యాంగ్ లీడర్ చేసిన ప్రియాంక మోహన్ ని సరిపోదా శనివారం సినిమాకు తీసుకున్నారు. అంతేకాదు పవర్ స్టార్ ఓజీ లో కూడా ప్రియాంక హీరోయిన్ గా చేసింది.

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్..

ఒకవేళ ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమాలో కూడా ఆమె కంఫర్టబుల్ అని ఆమెను తీసుకుంటారేమో చూడాలి. ఏది ఏమైనా నాని సినిమాలో హీరోయిన్ ఎవరైనా సరే ఆ అమ్మడికి ఇది కచ్చితంగా లక్కీ ఛాన్స్ అవుతుంది. ఐతే టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ చాలా మంది ఎంట్రీ ఇచ్చారు. భాగ్య శ్రీ, మమితా బైజు, అనస్వర రాజన్ ఇలా కొత్త హీరోయిన్స్ ఉన్నారు. వాళ్లలో ఎవరినైనా సెలెక్ట్ చేస్తారేమో చూడాలి.

నాని తో సినిమా చేసేందుకు రుక్మిణి వసంత్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఐతే ప్రస్తుతం అమ్మడికి ఉన్న డిమాండ్ చూస్తుంటే స్టార్ హీరోలు వరుస సినిమాలు చేసేలా ఉన్నారు. సో నాని సుజీత్ కాంబో హీరోయిన్ ఎవరైనా సరే ఆ భామ ఖాతాలో ఒక మంచి సినిమా పడినట్టే లెక్క. ప్రస్తుతం ది ప్యారడైజ్ షూట్ లో బిజీగా ఉన్న నాని సుజీత్ సినిమా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో మొదలు పెడతారని తెలుస్తుంది. సుజీత్ ఆఫ్టర్ నాని మూవీ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయాలని కథ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News