నాని- సుజీత్ మూవీ.. మొత్తం మ్యాటర్ ఇదీ!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో ఓ మూవీ వస్తున్నట్లు కొంతకాలం క్రితం అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే;
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో ఓ మూవీ వస్తున్నట్లు కొంతకాలం క్రితం అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో నాని, సుజీత్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం జరగ్గా.. వాటికి రీసెంట్ గా తెరపడింది.
ప్రస్తుతం హిట్-3 ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న నాని.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ సమయంలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటున్నారు. అలా తన అప్ కమింగ్ ప్రాజెక్టులపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన నెక్స్ట్ మూవీ ప్యారడైజ్, మే 2వ తేదీ నుంచి షూటింగ్ మొదలవుతుందని తెలిపారు.
ప్యారడైజ్ తర్వాత సుజీత్ తో చేసే మూవీ మొదలవుతుందని చెప్పిన నాని.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చేశారు. కానీ సుజీత్ ముందు.. పవన్ కళ్యాణ్ గారి సినిమా పూర్తి చేయాలని అన్నారు. ఓజీ మూవీ తర్వాతే సుజీత్ తో కన సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పారు. అయితే ఓజీని జులై లోపల పూర్తి చేయాలని పవన్ ఫిక్స్ అయ్యారని టాక్.
దీంతో 2025లో నాని, సుజీత్ మూవీ స్టార్ట్ అవ్వడం గ్యారెంటీ అని చెప్పాలి. తాజాగా మరో ఇంటర్వ్యూలో ఆ ప్రాజెక్ట్ రిలీజ్ విషయంపై మాట్లాడారు. 2026లోనే ఆ సినిమా కూడా రిలీజ్ అవుతుందని చెప్పారు. ప్యారడైజ్ సహా మొత్తం మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదలవుతాయని నేచురల్ స్టార్ క్లారిటీ ఇచ్చారు.
స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా నాని- సుజీత్ మూవీని వెంకట్ బొల్లినేని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ముందు నిర్మాతగా డీవీవీ దానయ్య పేరు వినపడినా.. ఆ తర్వాత వెంకట్ రూపొందిస్తున్నారని టాక్ వచ్చింది. అయితే ఇప్పటికే శ్యామ్ సింగరాయ్ మూవీకి గాను నాని, వెంకట్ బొల్లినేని కలిసి వర్క్ చేసిన విషయం తెలిసిందే.
ఏదేమైనా నాని.. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకుని సత్తా చాటుతున్నారు. ఇప్పుడు హిట్ -3 మూవీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత ప్యారడైజ్, సుజీత్ మూవీ.. అలా వివిధ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరి ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.